Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే రోహిత్ ఆడట్లేదు - బుమ్రా ఆ రోజు వచ్చేస్తాడు: హార్దిక్ పాండ్య

LSG VS MI: ఐపీఎల్ 2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ముంబయి ఇండియన్స్ వర్సెస్ లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ తలపడుతున్నాయి. గత మ్యాచ్‌లో విజయంతో ముంబయి గాడిలో పడగా.. లఖ్‌నవూ ఓడి ఢీలా పడింది. అయితే ఇప్పుడు జరగబోయే మ్యాచులో ఇరు జట్లు గెలవాలని పట్టుదలతో ఉన్నాయి.

రోహిత్ కు గాయం..
ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుని ఫీల్డింగ్ కు దిగింది. దీంతో లక్నో బ్యాటింగ్ కు దిగనుంది. అయితే ఈ మ్యాచుకు ముంబయి మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక ఇదే బుమ్రా ఐపీఎల్‌ కమ్‌బ్యాక్‌పై హింట్ ఇచ్చాడు కెప్టెన్ హార్దిక్ పాండ్య. త్వరలోనే బుమ్రా తిరిగి వస్తాడని చెప్పాడు.

IPL 2025 LSG VS MI Hardik pandya gave update on Rohit sharma injury and Bumrah IPL comeback

బుమ్రా అప్పుడే వస్తాడు
" మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. వికెట్ చూడటానికి బాగుంది. కానీ ఎలా ఉంటుందనేది చెప్పలేను. మంచు తర్వాత రావొచ్చు. ఛేధనకు అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నాను. మేము పిచ్ గురించి పెద్దగా చర్చించుకోవట్లేదు. కేవలం మంచి క్రికెట్ ఆడటంపైనే దృష్టి పెట్టాం. రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. అతడు ఈ మ్యాచుకు అందుబాటులో ఉండటం లేదు. బుమ్రా త్వరలోనే జట్టులోకి వస్తాడు." అని హార్దిక్ పాండ్య చెప్పాడు.

ఒక మార్పుతో లక్నో..
"మా బ్యాటింగ్ విభాగం, బ్యాటర్ల నైపుణ్యాలపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మాది బలమైన బ్యాటింగ్ లైనప్. మేము ఈ టోర్నమెంట్ ఆసాంతం మంచి ప్రదర్శన చేయాలని నిర్ణయించుకున్నాం. మేం లక్ష్యం ఏమీ పెట్టుకోలేదు. కేవలం బంతిని బాదాలి, బంతిని చూడాలి, దానిపై స్పందించాలి. ఇది మాత్రమే చేస్తాం. మా జట్టు అంతా ఆత్మస్థైర్యంతో ఉంది. అయితే ఈ మ్యాచులో మా జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. సిద్ధార్థ్ స్థానంలో ఆకాశ్ దీప్ వచ్చాడు." అని పంత్ అన్నాడు.

ముంబయి ఇండియన్స్ తుది జట్టు
విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, దీపక్ చాహర్, విఘ్నేశ్ పుత్తూర్

లఖ్ నవూ సూపర్ జెయింట్స్ తుది జట్టు
ఐడెన్ మార్కమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్) ఆయూష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్

Story first published: Friday, April 4, 2025, 19:29 [IST]
Other articles published on Apr 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+