Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG VS MI: హార్దిక్ పాండ్య పాంచ్ పటాఖా..

LSG VS MI: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. దీంతో ముంబయి ఇండియన్స్ లక్ష్యం 204గా నమోదైంది.

ఆ ఇద్దరు ధనాధన్..
టాస్ గెలిచిన ల‌క్నోకు బ్యాటింగ్ లో ఓపెన‌ర్లు మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 60 పరుగులు), మార్క్రమ్ (38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 53 పరుగులు) మంచి శుభారంభం ఇచ్చారు. భీక‌ర ఫామ్‌లో ఉన్న‌ మార్ష్ అయితే తొలి ఓవ‌ర్ నుంచే బంతిని దంచుతూ.. ముంబైపై చెలరేగాడు. బౌల్ట్ , దీప‌క్ చాహ‌ర్ బౌలింగ్‌లో భారీ షాట్ల‌తో బౌండ‌రీలు బాదాడు. అనంతరం యువ‌పేస‌ర్ అశ్వినీ కుమార్‌ బౌలింగ్ లో ఆధిపత్యం ప్రదర్శించాడు. కానీ ఆ తర్వాత విఘ్నేశ్ పుత్తూర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆయూష్ బదోనీ (19 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 30 పరుగులు) కీలక ఇన్నింగ్స్ తో రాణించాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (14 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 27 పరుగులు) ధనాధన్ ఆడాడు. మిగతా వారు విఫలమయ్యారు.

హార్దిక్ పాంచ్ పటాఖా...
ముంబయి బౌలర్లలో హార్దిక్ పాండ్య అదిరే ప్రదర్శన చేశాడు. 5 వికెట్ల ప్రదర్శన చేసి అదరగొట్టాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లు చెలరేగి ఆడుతున్నా.. వారికే చెమటలు పట్టించాడు. ఇతర ముంబయి బౌలర్లలో ట్రెన్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేశ్ పుత్తూర్ తలో వికెట్ దక్కించుకున్నారు.

IPL 2025 LSG VS MI Hardik pandya 5 wickets Mumbai indians target 204 against Lucknow Super Giants
Story first published: Friday, April 4, 2025, 21:26 [IST]
Other articles published on Apr 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+