Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG VS MI: ఆఖరి ఓవర్లో జస్ట్ మిస్.. ఉత్కంఠ పోరులో ముంబయిపై లక్నో విజయం

LSG VS MI: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ పోరులో హౌం గ్రౌండ్ లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌పై గెలుపొందింది. ఐపీఎల్‌ 18లో లక్నోకు ఇది రెండో విజయం. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముబయి ఇండియన్స్ పోరాడి ఓడింది. హార్దిక్ పాండ్య బంతితో, బ్యాట్ తో పోరాడిన ఫలితం దక్కలేదు. చివర్లో శార్దూల్ ఠాకూర్ ముంబయి జట్టును బాగా కట్టడి చేశాడు. ముంబయి విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరం కాగా, 9 పరుగులే వచ్చాయి. దీంతో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 రన్స్ కు పరిమితమైంది.

ముంబయి బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 67 పరుగులు) నమన్ ధీర్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 46 పరుగులు) ధనాధన్ ఆడారు. చివర్లో వచ్చిన తిలక్ వర్మ (23 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 25 పరుగులు), హార్దిక్ పాండ్య (16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 28 నాటౌట్ ) దూకుడుగా ఆడారు. శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ సింగ్ తలో వికెట్ తీశారు.

IPL 2025 LSG VS MI Lucknow Super Giants won by 12 runs against Mumbai Indians

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఓపెన‌ర్లు మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 60 పరుగులు), మార్క్రమ్ (38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 53 పరుగులు) మంచి శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు ఈ జోడీ 76 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆయూష్ బదోనీ (19 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 30 పరుగులు) కీలక ఇన్నింగ్స్ తో రాణించాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (14 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 27 పరుగులు) ధనాధన్ ఆడాడు. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (2) మరోసారి విఫలమయ్యాడు. పూరన్‌ (12), అబ్దుల్‌ సమద్‌ (4), శార్దుల్‌ ఠాకూర్‌ (5*), ఆకాశ్‌ దీప్‌ (0), అవేశ్‌ ఖాన్‌ (2*) పరుగులు చేశారుముంబయి బౌలర్లలో హార్దిక్ పాండ్య 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ట్రెన్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేశ్ పుత్తూర్ తలో వికెట్ తీశాడు.

Story first published: Friday, April 4, 2025, 23:36 [IST]
Other articles published on Apr 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+