Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: కేఎల్ రాహుల్‌పై వేటు.. లక్నోకు కొత్త కెప్టెన్ ఖరారు!

ఊహించినట్లుగానే తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ వదులుకోవడానికి సిద్ధమైంది. కొత్త కెప్టెన్‌ను కూడా ఖరారు చేసిందని తెలుస్తోంది. రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి మరో మూడు రోజుల మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో లక్నో ఫ్రాంచైజీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లతో పాటు ముగ్గురు స్టార్ ప్లేయర్లను రిటైన్ చేసుకోనుంది.

అక్టోబర్ 31వ తేదీలోపు ఫ్రాంచైజీలు తమ రిటైన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది.నిబంధనలకు అనుగుణంగా నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా ఫ్రాంచైజీ దక్కించుకోవచ్చు.

IPL 2025 LSG Set to Retain Nicholas Pooran as Likely Captain Alongside Mayank and Ravi Bishnoi

రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లుగా నిర్ణయించింది. కాగా, లక్నో ఫ్రాంచైజీ ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు మోహ్షిన్ ఖాన్, ఆయుష్ బదోని రిటైన్ చేసుకోవడానికి నిర్ణయించుకుంది.

ఇక నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు వెచ్చించి తీసుకోనుంది. అంతేగాక నికోలస్ పూరన్ సారథి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుంది. మార్కస్ స్టొయినిస్‌ను రైట్ టూ మ్యాచ్ కార్డ్ ద్వారా దక్కించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

గత కొంతకాలంలో టీ20ల్లో పూరన్ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డులు కూడా బద్దలుకొడుతున్నాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్‌గానూ సత్తాచాటే పూరన్ రిటైన్ లిస్ట్‌లో తమ ప్రథమ ఎంపికగా ఖరారు చేసిందని సమాచారం. కాగా, రాహుల్ వేలంలోకి రానుండటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ వ్యూహాలు మొదలుపెట్టింది. కర్ణాటకకు చెందిన రాహుల్‌ను దక్కించుకుని కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని ఆర్సీబీ భావిస్తోంది.

లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ లిస్ట్ (అంచనా)
నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, ఆయుష్ బదోని, మోహ్సిన్ ఖాన్.

Story first published: Monday, October 28, 2024, 13:16 [IST]
Other articles published on Oct 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+