Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఆర్సీబీపై కుల్దీప్ సెటైర్లు.. రెచ్చిపోయి అలా చేసిన ఫ్యాన్స్!

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఐపీఎల్ బెంగళూరు ( ఆర్సీబీ) జట్టు అభిమానులు ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంటున్నారు. దీంతో వాళ్లను శాంతపరిచేందుకు కుల్దీప్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అసలు ఏం జరిగిందంటే?

రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఫుట్‌బాల్, క్రికెట్ అంటే ఇష్టమని చెప్పాడు కుల్దీప్. దీంతో ఆర్సీబీ ఫ్యాన్ ఒకరు బెంగళూరు ఫుట్‌బాల్ జట్టులో గోల్ కీపర్ పోస్టు ఖాళీగా ఉందని చెప్పాడు. దాని కోసం ఆ జట్టులో చేరాలని కామెంట్ పెట్టాడు. దీనికి కుల్దీప్ సెటైరికల్‌గా రిప్లై ఇచ్చాడు.

IPL 2025 Kuldeep Yadav tries to calm down after facing TROLLS from Royal Challengers Bengaluru

"మీకు గోల్ కీపర్ కాదు అవసరం. ట్రోఫీ కావాలి. గోల్‌ కీపర్‌తో మీరేం చేస్తారు" అంటూ సదరు ఆర్సీబీ ఫ్యాన్‌ను ఉద్దేశించి కుల్దీప్ సెటైరికల్ కామెంట్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగా వైరల్‌ అయింది.

రెచ్చిపోయిన ఫ్యాన్స్
కుల్దీప్ యాదవ్ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో.. అవి ఆర్సీబీ ఫ్యాన్స్ కంట పడ్డాయి. దీంతో అతడిని గ్యాప్ లేకుండా ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. అతడిపై ఎదురుదాడికి దిగారు. అతడి బౌలింగ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు అద్భుతంగా ప్రదర్శన చేసిన వీడియోలను షేర్ చేస్తూ కౌంటర్లు వేస్తున్నారు.

శాంతపరిచేందుకు కుల్దీప్ యాదవ్ ప్రయత్నాలు
తనపై ఆర్సీబీ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదురుకావడంతో వారిని శాంతపరిచేందుకు కుల్దీప్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. సోషల్ మీడియాలో మరో పోస్టు పెట్టాడు. "ఆర్సీబీ ఫ్యాన్స్ ట్రోఫీ మీదేలే. చిల్ ప్లీజ్. కానీ నేను గోల్‌కీపర్ కాదు" అంటూ రాసుకొచ్చాడు. ఇప్పుడీ పోస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాన్స్
కుల్దీప్ యాదవ్.. త్వరలోనే ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత మొదలు కానున్న ఐపీఎల్‌లోనూ ఆడనున్నాడు. దీల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు.

Story first published: Saturday, January 25, 2025, 13:06 [IST]
Other articles published on Jan 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+