Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC VS KKR: మైదానంలోనే రింకు సింగ్‌ను చెంప దెబ్బ కొట్టిన కుల్దీప్! (వీడియో)

DC VS RCB: ఐపీఎల్ 2025లో ఆటగాళ్ల మధ్య కొట్లాటలు ఎక్కువైపోతున్నాయి. సరదాగానో, సీరియస్ గానో.. మైదానంలో ఆటగాళ్లు మాటల యుద్ధానికి దిగడం, కొట్లాటకు వెళ్లడం చూస్తున్నాం. మొన్నటికి మొన్న మ్యాచు మధ్యలో కేఎల్ రాహుల్ - కోహ్లీ కాస్త సీరియస్ గా డిస్కషన్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడేమో తాజా మ్యాచులో రింకు సింగ్ ను కుల్దీప్ యాదవ్ ఏకంగా మైదానంలో రెండు సార్లు చెంప దెబ్బ కొట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అప్పట్లో హర్భజన్ - శ్రీశాంత్ కూడా..
అప్పట్లో ముంబై ఇండియన్స్ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పంజాబ్ కింగ్స్ మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌ను చెంపపై కొట్టిన సంఘటన ఎంత పెద్ద చర్చనీయాంశమైందో తెలిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు క్రికెట్ అభిమానులను కదిలించాయి. ఈ ఘటనపై అప్పట్లో బీసీసీఐ కూడా తీవ్రంగా స్పందించింది. హర్భజన్‌పై 11 మ్యాచ్‌ల నిషేధం విధించింది. ఆ తర్వాత హర్భజన్ సింగ్ కూడా తన తప్పు ఒప్పుకొని, శ్రీశాంత్‌ను కొట్టి ఉండాల్సింది కాదని అన్నాడు.

IPL 2025 Kuldeep Yadav beats Rinku Singh two times in DC VS KKR match video viral

కుల్దీప్.. రింకును ఎందుకు కొట్టాడు?
ఇప్పుడు తాజాగా జరిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచులో కుల్దీప్ యాదవ్ - రింకు సింగ్ విషయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. కేకేఆర్ ఆటగాడు రింకు సింగ్ ను దిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెంప దెబ్బ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా రింకు ముఖంలో హావాభావాలు మారిపోయాయి. బాగా ఫీలైపోయాడు. దీంతో ఏదో మళ్లీ చెప్పబోయిన రింకు సింగ్ ను కుల్దీప్ యాదవ్ మరోసారి చెంప దెబ్బ కొట్టాడు. కానీ కుల్దీప్ యాదవ్ ఎందుకు కొట్టాడో కారణం తెలియలేదు. సరదాగా కొట్టాడా లేదా నిజంగానే కొట్టాడా అనేది తెలియాల్సి ఉంది. మ్యాచ్ అయిపోయాక ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా కుల్దీప్ బౌలింగ్ లో రింకు సింగ్ 22 పరుగులు చేశాడు.

కుల్దీప్ పై బ్యాన్..
అయితే ఈ రింకును కుల్దీప్ కొట్టడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఇది సరదాగా జరిగిన చర్య అని సమర్థిస్తుంటే.. మరికొంతమంది కుల్దీప్ పై తీవ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతడిపై నిషేధం విధించాలని అడుగుతున్నారు.

Story first published: Wednesday, April 30, 2025, 8:28 [IST]
Other articles published on Apr 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+