ఐపీఎల్ మెగా వేలం హీట్ మొదలైంది. మరికొన్ని నెలల్లో జరగనున్నఈ మెగా ఆక్షన్ గురించి నిబంధనలు ఇంకా ఖరారు కాకముందే చర్చలు పెద్దఎత్తున సాగడం గమనార్హం. ఏ జట్టు ఏ ఆటగాడిని ఉంచుకుంటే ఉత్తమం, ఎవరిని వదులుకుంటే మంచిది? అని క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు స్టార్ క్రికెటర్లు ఫ్రాంచైజీలు మారుతున్నారనే పుకార్లు మొదలయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గురించి రాహుల్ కీలక కామెంట్లు చేశాడు. ఆ జట్టుకు వెళ్లాలని ఆశిస్తున్నా అంటూ పేర్కొన్నాడు.

ఇంతకీ వీడియోలో ఏం ఉందంటే.. ఆర్సీబీ వీరాభిమాని కేఎల్ రాహుల్‌తో మాట్లాడాడు. ''నేను ఆర్సీబీ వీరాభిమానిని. నేను ఎంతో కాలం నుంచి ఆర్సీబీకి మద్దతు ఇస్తున్నాను. మీరు ఆర్సీబీకి గతంలో ఆడారు. అయితే ఇప్పుడు కొన్ని పుకార్లు వస్తున్నాయి. దాని గురించి వివరించను. కానీ మీరు ఆర్సీబీలోకి తిరిగి రావాలని, సత్తాచాటాలని ఆశిస్తున్నాను'' అని సదరు అభిమాని పేర్కొన్నాడు. దానికి రాహుల్.. అలా జరగాల
ని ఆశిస్తున్నా అని రిప్లై ఇవ్వడం విశేషం.
ఐపీఎల్‌లో 17 సీజన్లు ముగిశాయి. ప్రతి సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ ఫేవరేట్‌గానే బరిలోకి దిగుతోంది. కానీ కప్ కల కలగానే మిగిలిపోతుంది. వరల్డ్ స్టార్ ప్లేయర్లు టీమ్‌లో ఉన్నా అదే రిజల్ట్ రిపీట్ అవుతుంది. ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందు జట్టును బలోపేతం చేయాలని, దాని కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ గట్టిగా భావిస్తోంది.
40 ఏళ్ల డుప్లెసిస్ స్థానంలో కొత్త కెప్టెన్‌ను తీసుకోవాలని యోచిస్తోంది. కేఎల్ రాహుల్ వేలంలోకి వస్తే భారీ ధరను వెచ్చించి ఆర్సీబీ సొంతం చేసుకోవాలనుకుంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా, రాహుల్ ఆర్‌సీబీతోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2013 నుంచి 2016 వరకు ఆర్‌సీబీ తరఫున ఆడాడు. గాయం కారణంగా 2017 సీజన్‌కు దూరంగా ఉన్న అతను 2018 మెగా వేలానికి ముందు పంజాబ్ జట్టుకు మారిపోయాడు. నాలుగేళ్ల పాటు పంజాబ్ కింగ్స్‌కు ఆడిన అతను ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు మారాడు.