KKR vs RCB: అదొక్కటి చేస్తే ఈసారి కూడా టైటిల్ మాదే - వరుణ్ చక్రవర్తి
KKR vs RCB: రీసెంట్‌గా ఇంగ్లాండ్ టీ20, వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుంగా రాణించిన వరుణ్ చక్రవర్తి.. ఇప్పుడు ఐపీఎల్ సమరానికి సిద్ధమవుతున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే అతడు.. కేకేఆర్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు. గత సీజన్ లోనూ కేకేఆర్ విజయంలో కీలకంగా వ్యవహరించిన అతడు.. ఈ సీజన్ లోనూ కీలకంగా వ్యవహరిస్తాడని అంతా ఆశిస్తున్నారు. ఐపీఎల్ 2025 ఓపెనింగ్ మ్యాచ్ లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో వరుణ్.. కేకేఆర్ విజయవకాశాలపై మాట్లాడాడు.
మీరు ఆర్సీబీపై ఆడినప్పుడల్లా విజయం సాధిస్తూనే ఉన్నారు. అందుకు గల కారణం ఏంటి?
"ఇందులో ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ లేదు. ఆయా మ్యాచ్‌ల పరిస్థితులు మాత్రమే నాకు వికెట్లు తీయడంలో సాయపడ్డాయి. ఆ మ్యాచ్‌లలో పరిస్థితులు మాకు పూర్తిగా అనుకూలంగా ఉండటంతో, నేను ఉత్తమ ఫలితాన్ని సాధించగలిగాను."
టైటిల్ కోసం కేకేఆర్ మొత్తం జట్టు ఎలా సన్నద్ధం అవ్వాలని అనుకుంటున్నారు?
"మా జట్టు బలంగా కనిపిస్తోంది. విజయానికి అవసరమైన వ్యూహాన్ని అర్థం చేసుకుని, ఉత్తమమైన ప్లేయింగ్ XIతో స్థిరమైన ప్రదర్శన ఇవ్వగలగడం చాలా కీలకం. మొదటి మూడు మ్యాచ్‌ల్లో మేం కోర్ సెట్ చేయగలిగితే, ఈ సీజన్‌లో మాకు విజయ అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయి."
గత సీజన్ తర్వాత చాలా మార్పులు జరిగాయి. భారత జట్టులో కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడు ఈ ఏడాది IPLలో అడుగుపెడుతున్నారు. ఈ అనుభవాల ద్వారా ఏమైనా మార్పులు చేసుకున్నారా?
"ప్రధానంగా నేను స్థిరతం (నిలకడగా రాణించడం) పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నాను. ఎందుకంటే ఇది పూర్తిగా నేర్చుకోవడం చాలా కష్టమైన విషయం. దీని కోసం నేను నిరంతరం కష్టపడుతున్నాను. అంతేకాకుండా, కొన్ని కొత్త బంతులపై కూడా సాధన చేస్తున్నాను. అవి రాబోయే మ్యాచ్‌ల్లో మంచి ఫలితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను."

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications