KKR VS RCB: కొత్త సారథుల నాయకత్వంలో - ఫస్ట్ పంచ్ ఎవరిదో?
అసలైన క్రికెట్ మజాను అందించేందుకు మెగా ఐపీఎల్ సమరం వచ్చేసింది. వచ్చే రెండు నెలల పాటు నిర్విరామంగా క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు ఈ పొట్టి క్రికెట్ సిద్ధమైపోయింది. ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఐపీఎల్ 2025 సీజన్ అంగరంగ వైభవంగా మన కళ్ల ముందుకు వచ్చేసింది. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ తో ఈ 18వ సీజన్ తెరలేవనుంది. దీంతో టైటిలే లక్ష్యంగా అన్నీ జట్లు వ్యూహాలకు పదును పెట్టి బరిలోకి దిగుతున్నాయి.
కొత్త సారథుల నాయకత్వంలో..
అయితే ఈ ఏడాది ఐపీఎల్ లోని పది జట్లలో భారీ మార్పులు చోటు చేసుకోవడం విశేషం. ముఖ్యంగా కొన్ని జట్లకైతే కొత్త సారథులు కూడా వచ్చేశారు. ఐదు జట్ల కెప్టెన్లూ మారారు. లక్నోకు రిషభ్ పంత్, పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి అక్షర్ పటేల్, బెంగళూరుకు రజత్ పాటిదార్, కోల్‌కతాకు అజింక్య రహానే సారథులుగా ఎంపికయ్యారు. దీంతో ఈ కొత్త సారథులు.. ఈ కొత్త సీజన్ లో ఎలా రాణిస్తారన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. పైగా ఓపెనింగ్ మ్యాచ్ కూడా కొత్త సారథుల నాయక్వంలోనే జరగనుండటం పెద్ద విశేషమనే చెప్పాలి.
ఈ సందర్భంగా ఓపెనింగ్ మ్యాచ్ లో తలపడబోయే ఢిపెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ - ఆర్సీబీ బలాబలాలు, హెడ్ టు హెడ్ రికార్డ్స్, తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి, అభిమానుల మద్దతు ఏ జట్టుపై ఉంది అనేది ఓ లుక్కేద్దాం..

ఇద్దరూ కొత్త కెప్టెన్లే...
ఈ సీజన్ లో విజయమే లక్ష్యంగా కేకేఆర్, ఆర్సీబీ కొత్త సారథులతో బరిలోకి దిగుతున్నాయి. సీనియర్ బ్యాటర్ రహానే కేకేఆర్ కు సారథ్యం వహిస్తుండగా, రజత్ పటిదార్ ఆర్సీబీకి నాయకత్వం వహించనున్నాడు. దీంతో తొలి మ్యాచ్ లోనే కొత్త నాయకుల సారథ్యంలో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ తలపడనుండడంతో... ఓపెనింగ్ మ్యాచ్ పై క్రికెట్ అభిమానుల్లో ఉత్సుకత మరింత ఎక్కువగా ఉంది.
పిచ్ ఎలా ఉందంటే?
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ స్టేడియం పిచ్ పై ఉండే ఫ్లాట్ సర్ఫేస్, పర్ఫెక్ట్ బౌన్స్.. బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్ది, పిచ్ స్లోగా మారి స్పిన్నర్లకు ఉపయోగకరంగా మారుతుంది. ఈ పిచ్ పై 93 ఐపీఎల్ మ్యాచులు జరగగా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 38 సార్లు, ఛేజింగ్ జట్టు 55 సార్లు విజయం సాధించింది.
హెడ్ టు హెడ్ రికార్డ్స్
కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య 34 మ్యాచులు జరగగా అందులో కేకేఆర్ పై చేయి సాధించింది. 20 సార్లు విజయాన్ని ఎగరేసుకుపోయింది. ఆర్సీబీ 14 సార్లు గెలిచింది. పైగా ఇప్పుడు కేకేఆర్ కు.. ఈడెన్ గార్డెన్స్ హౌం గ్రౌండ్. ఇది కేకేఆర్ కు బాగా కలిసొచ్చే అంశం. ఈ సొంత గూటి స్టేడియంలో కేకేఆర్ ఇప్పటివరకు 8 సార్లు విజయం సాధించగా, నాలుగు సార్లు మాత్రమే పరాజయం పొందింది. గత సీజన్ లో ఈ రెండు జట్లు, రెండు సార్లు తలపడగా.. కేకేఆరే విజయం సాధించింది.
రెండు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
- కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీలో ముందుగా అందరి కళ్లు కోహ్లీపైనే. అతడే కీలక ఆటగాడు కూడా. దీంతో ఇప్పుడతడు ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేకేఆర్ పై ఇప్పటివరకు అతడు 962 పరుగులు చేశాడు.
- ఇంకా ఆర్సీబీ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్.. కొత్త బంతిని స్వింగ్ చేయడంలో దిట్ట. ఐపీఎల్ చరిత్రలో అతడు పవర్ ప్లేలో 71 అత్యధిక వికెట్లు తీశాడు.
- ఆర్సీబీ కెప్టెన్ పటిదర్ స్పిన్నర్లపై చెలరేగి ఆటగలడు. ఐపీఎల్ 2024 గత సీజన్ లో అతడు స్పిన్నర్లపై 197.24 స్టైక్ రేట్ తో విజృంభించాడు.
- కేకేఆర్ లో సునీల్ నరైన్ అద్భుతంగా ఆడగలడు. అతడు 6.68 ఎకానమీతో ఆర్సీబీపై ఇప్పటివరకు 26 వికెట్లు తీశాడు.
- కేకేఆర్ లో మరో కీలకమైన ప్లేయర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. అతడు కూడా స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. కాబట్టి ఆర్సీబీతో ఇతడితో జాగ్రత్తగా ఉండాలి.
వర్షం పడే అవకాశం..
ఇక వాతావరణ విషయానికొస్తే వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. చూడాలి ఏం జరుగుతందో.
KKR vs RCB తుది జట్టు అంచనా
కేకేఆర్ - క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రఘువంశీ, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, అన్రిచ్ నోర్జే, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా.
ఆర్సీబీ - ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications