గతేడాది ఐపీఎల్ కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియాలో అతడి భార్య పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. అందులో ఆమె వెంకటేశ్ అయ్యర్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ క్రికెట్ ఫ్యాన్స్ ను ఆకర్షిస్తున్నాయి.
స్మార్ట్ లుక్ లో వెంకటేశ్
కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కొత్త ఏడాది కొత్తగా మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. 30 ఏళ్ల ఈ భారత క్రికెటర్ తన లుక్ కూడా పూర్తిగా మార్చేశాడు. సరికొత్తగా ఫ్రెష్ మేకోవర్ లో కనిపించాడు. సాధారణంగా నేచురల్ లుక్ లో ఉంటే వెంకటేశ్ అయ్యర్ ఈ సారి పూర్తిగా స్మార్ట్ లుక్ లోకి మారిపోయాడు. హెయిర్ ట్రిమ్ చేసుకుని షార్ట్ కటింగ్ లో కనిపించాడు. గడ్డం కూడా క్లీన్ షేవ్ చేసి, కేవలం మీసం మాత్రమే పెట్టుకున్నాడు.

శ్రుతి ఫన్నీ వీడియో పోస్ట్
అయితే వెంకటేశ్ లుక్ ను చూపిస్తూ అతడి భార్య శ్రుతి రఘునాథన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో వెంకటేశ్ తన కొత్త లుక్ కనపడకుండా ఉండేలా మాస్క్ ధరించి నడుస్తూ కనిపించాడు. కానీ శ్రుతి అతడి లుక్ ను వీడియో తీసి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ రాసుకొచ్చింది. 'బ్రో కొత్త సంవత్సం నన్ను మళ్లీ సీరియస్ గా దగ్గరతీసుకో' అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. క్రికెట్ ఫ్యాన్స్ కూడా దీన్ని షేర్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా, వెంకటేశ్ అయ్యర్ గతేడాది జూన్ 3న శ్రుతి రఘునాథన్‌తో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. 2023 నవంబర్‌లో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ మాస్టర్స్ డిగ్రీ చేసిన శ్రుతి ప్రస్తుతం బెంగళూరులోని ఓ సంస్థలో పని చేస్తోంది.
అప్పగిస్తే ఫుల్ హ్యాపీ
ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ నెగ్గడంలో వెంకటేశ్ అయ్యర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తొలి క్వాలిఫయర్, ఫైనల్‌లో హాఫ్ సెంచరీలు సాధించాడు. దీంతో 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో అతడికి మంచి డిమాండ్ లభించింది. కేకేఆర్ అతడిని రూ.23.75 కోట్లకు మళ్లీ దక్కించుకుంది.అయితే గత సీజన్ లో కేకేఆర్ కు కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ ఈ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ కు వెళ్లిపోయాడు. దీంతో కేకేఆర్ కొత్త కెప్టెన్ రేసులో వెంకటేశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీనిపై కూడా వెంకటేశ్ మాట్లాడాడు. తనకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఎక్కువ సంతోషపడతానని, కచ్చితంగా పగ్గాలు స్వీకరిస్తానని చెప్పుకొచ్చాడు.