ఐపీఎల్-2025కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు భారీ షాక్. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ గాయపడ్డాడు. ప్రస్తుతం జరుగుతోన్న రంజీ ట్రోఫీ మ్యాచ్ లో అతడికి దెబ్బ తాకింది.ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్ లో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా మధ్యప్రదేశ్ జట్టు.. కేరళ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ లో మధ్యప్రదేశ్ కు ప్రాతినిథ్యం వహిస్తోన్న వెంకటేశ్ అయ్యర్.. జట్టు స్కోర్ 50/4 ఉన్న సమయంలో బ్యాటింగ్ కు వచ్చాడు. జట్టును మంచి స్కోరు అందించాలనే ఉద్దేశంతో బ్యాటింగ్ చేస్తుండగా.. అతడి కుడి కాలి చీలమండకు గాయమైంది.
మూడు బంతులు ఎదుర్కోగానే అతడి గాయం తగిలింది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడుతూ కిందపడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించారు. కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. ఇక చేసేదేమిలేక అతడు మైదాన్ని వీడాల్సి వచ్చింది.

ఈ గాయం వల్ల అయ్యర్ మిగిలిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. అయితే వెంకటేశ్ కు అయిన గాయం కేకేఆర్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ దగ్గర పడుతోంది. పైగా గత సీజన్‌లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలవడంలో అతడే కీలకంగా వ్యవహరించాడు. దీంతో మెగా వేలంలో రూ.23.75 కోట్లు భారీ ధర వెచ్చించి మరీ వెంకటేశ్‌ను కేకేఆర్ కొనుగోలు చేసింది కేకేఆర్. అందుకే అతడికి గాయం త్వరగా తగ్గిపోవాలని ఆశిస్తున్నారు.