ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్నరప్‌గా నిలిచింది. కప్ గెలవలేకపోయినా క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడేలా, ప్రత్యర్థులు సలామ్ కొట్టేలా విధ్వంసం సృష్టించింది. ఫైనల్‌లో కేకేఆర్ చేతిలో ఘోర ఓటమి మినహా.. రికార్డులను బ్రేక్ చేస్తూ చరిత్రను తిరగరాస్తూ పోరాడింది. అయితే ఐపీఎల్-2025లో టైటిలే లక్ష్యంగా ఎస్‌ఆర్‌హెచ్ ప్రణాళికలు రచిస్తోంది.
ఈ నేపథ్యంలో రిటైన్డ్ ప్లేయర్ల జాబితాపై సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. బీసీసీఐ రిటెన్షన్ పాలసీ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ గరిష్టంగా నలుగురు లేదా ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ కోఓనర్ కావ్య మారన్ ఆట పరంగానే కాకుండా ఆర్థిక పరంగానూ ఆలోచిస్తూ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైంది.

ఈ సీజన్‌లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టును గొప్పగా నడిపించాడు. అయితే కమిన్స్ మినీ వేలంలో రూ.20.25 కోట్లకు పలికాడు. గత నిబంధనల ప్రకారం.. రిటైన్ చేసుకుంటే కమిన్స్‌కు అదే మొత్తాన్ని వెచ్చించాల్సిన పనిలేదు. కానీ కమిన్స్ దానికి అంగీకరిస్తాడా అనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో కమిన్స్‌ను విడిచిపెట్టి రైట్ టూ మ్యాచ్ కార్డ్ ద్వారా తిరిగి తీసుకోవాలని ప్రాంఛైజీ భావిస్తోంది. కానీ ఆర్‌టీమ్ కార్డ్ రూల్స్ గురించి ఇంకా స్పష్టత లేదు. కాగా, మరికొన్ని నెలల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఈ టాప్-3 ప్లేయర్లను సన్‌రైజర్స్ విడిచిపెట్టాలని ఫిక్స్ అయ్యింది.
మార్క్‌రమ్ మామకు టాటా
ఎస్‌ఆర్‌హెచ్‌లో మార్క్‌రమ్ కీలక సభ్యుడే కాదు, మాజీ కెప్టెన్ కూడా. అంతేగాక సౌతాఫ్రికాటీ20 లీగ్ (ఎస్ఏ టీ20)లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్‌కు సారథి. అక్కడ కేప్‌కు టైటిల్ కూడా అందించాడు. కానీ 2023లో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు పగ్గాలు అందుకున్న మార్క్‌రమ్ కెప్టెన్‌గా దారుణంగా విఫలమయ్యాడు. అయితే 2024లో ఆటగాడిగా సత్తాచాటుతాడనుకుంటే నిరాశపరిచాడు. అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో మార్క్‌రమ్ మామకు టాటా చెప్పాలని ఫ్రాంచైజీ నిర్ణయించుకుంది.
భువనేశ్వర్‌కు బైబై
సన్‌రైజర్స్ జట్టులో అత్యంత సీనియర్ ప్లేయర్ భువనేశ్వర్. 2014 నుంచి జట్టులో కొనసాగుతున్నాడు. విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2016లో ఎస్‌ఆర్‌హెచ్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర. 2016, 2017లో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. అయితే గాయాల నుంచి కోలుకుని తిరిగొచ్చిన భువీ ఆ తర్వాత కాస్త పదును కోల్పోయాడు. ఈ సీజన్‌లో 34 ఏళ్ల భువీ 16 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో భువీకి బైబై చెప్పి యువ ప్లేయర్లకు రిటైన్డ్ ప్లేయర్ల జాబితాలో అవకాశం ఇవ్వాలని ఫ్రాంచైజీ భావిస్తోంది.
జేన్సన్‌పై వేటు
బంతితో పాటు బ్యాటుతోనూ మార్కో జేన్సన్ సత్తాచాటగలడు. అయితే జేన్సన్ అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోతున్నాడు. అంతేగాక ఈ సీజన్‌లో జేన్సన్‌కు తుదిజట్టులో కూడా చోటు దక్కడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో జేన్సన్‌కు బై చెప్పాలని ఎస్‌ఆర్‌హెచ్ ఫిక్స్ అయ్యింది. ఐపీఎల్-2021లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన జేన్సన్ ఆ తర్వాత హైదరాబాద్ ఫ్రాంచైజీకి వచ్చాడు.