Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: అంతా తిరిగొచ్చేశారు.. టైటిల్ ఆ జట్టుదే..!

IPL 2025: భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తల మధ్య వాయిదా పడిన ఐపీఎల్ 2025ను బీసీసీఐ వారం పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఉద్రిక్తతలు తగ్గిపోవడం ఐపీఎల్ ఈ నెల 17 నుంచి పున:ప్రారంభం కానుంది. ఉద్రిక్తతల కారణంగా స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ప్లేయర్లు.. పరిస్థితులు సద్దుమణగడంతో తిరిగి భారత్‌కు చేరుకుంటున్నారు. ఐపీఎల్ పునఃప్రారంభం కాబోతున్న వేళ ఆర్సీబీకి గుడ్ న్యూస్ అందింది. జాతీయ విధుల నేపథ్యంలో జేకబ్ బెథెల్ మాత్రమే ఐపీఎల్ లీగ్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తోంది.

ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ తిరిగివచ్చేందుకు అంగీకరించడం ఆర్సీబీకి నిజంగానే పెద్ద శుభవార్తే. నిజానికి ఆర్సీబీ స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ వాయిదా పడకముందే గాయపడ్డాడు. ఐపీఎల్ రీషెడ్యూల్ తర్వాత హేజిల్‌వుడ్ అందుబాటులోకి రావడం దాదాపుగా అసాధ్యమేనని అందరూ భావించారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 11న ఉండడంతో అతను జాతీయ విధులకే ప్రాధాన్యత ఇస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఆర్సీబీ యాజమాన్యం చర్చల కారణంగా హేజిల్‌వుడ్ ఈ ఐపీఎల్ సీజన్ అయిపోయే వరకు ఆడేందుకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. మరోవైపు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా తమ ఆటగాళ్లకు లీగ్ అయిపోయే వరకు కొనసాగేందుకు అనుమతి ఇవ్వడంతో లుంగి ఎంగిడి బౌలింగ్‌ను కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉపయోగించుకోనుంది.

IPL 2025 Josh Hazlewood Returns RCB s Best Chance to Win Their First Title

మిగతా విదేశీ ప్లేయర్లు ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్ ప్లేఆఫ్స్ లో ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఐర్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికైనా రొమారియో షెపర్డ్ తమ బోర్డును ఒప్పించుకుని ఐపీఎల్ లీగ్ మొత్తానికి అందుబాటులోకి వచ్చాడు. ఈ క్రమంలో విదేశీ ఆటగాళ్లంతా లీగ్ అయిపోయవరకు అందుబాటులో ఉండనున్నారు. ఇది ఆర్సీబీకి మామూలు గుడ్ న్యూస్ కాదు. ఆర్సీబీ జట్టు ఎన్నడూ లేనంత బలంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆర్సీబీ తొలి టైటిల్ కల నెరవేరేలా కనిపిస్తోంది.

ఆర్సీబీ దేశీయ ఆటగాళ్లలో అత్యంత ప్రమాదకర ప్లేయర్లు కూడా ఉన్నారు. బౌలర్లలో యశ్ దయాల్, కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ అద్భుతంగా రాణిస్తుండగా.. బ్యాటర్లలో ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ టాపార్డర్ లో దంచి కొడుతున్నారు. ఆర్సీబీకి ప్రధాన సమస్య ఒకటి ఉంది. వారి కెప్టెన్ రజత్ పాటిదార్ వేలికి గాయం కావడంతో ఆడతాడా లేదా అనే సందేహాలు ఉన్నాయి. కీపర్ జితేష్ శర్మ మాత్రం అంచనాలకు తగినట్లుగా ఆడడం లేదనిపిస్తోంది. వీరిద్దరు కూడా ఫామ్ లోకి వస్తే ఆర్సీబీ ఆపడం ఎవరి తరం కాదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. మరో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ దూసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Story first published: Thursday, May 15, 2025, 15:08 [IST]
Other articles published on May 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+