For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: ముంబై ఇండియన్స్‌‌‌కు కొత్త కోచ్.. టీ20 వరల్డ్ కప్ విజేత వచ్చేశాడు!

ముంబై ఇండియన్స్ తమ కోచింగ్ సిబ్బందిలో భారీ మార్పులు చేసింది. కొత్త ప్రధాన కోచ్‌తో పాటు బౌలింగ్ కోచ్‌‌ను నియమించింది. 2017 నుంచి 2022 వరకు పనిచేసిన మాజీ కోచ్ మహేలా జయవర్ధనెకు తిరిగి హెడ్ కోచ్‌గా బాధ్యతలు అందించింది. మార్క్ బౌచర్ స్థానంలో జయవర్ధనెను నియమిస్తున్నట్లు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

47 ఏళ్ల శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనె 2022 నుంచి కూడా ముంబై ఫ్రాంచైజీలోనే కొనసాగాడు. గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్‌గా ముంబై ఫ్యామిలీలోనే ఉన్నాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ లీగ్, ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ తరఫున, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబైకు కోచింగ్ స్టాఫ్‌గా టైటిళ్లు అందించాడు. కాగా, కోచ్‌గా మార్క్ బౌచర్ హయాంలో ముంబై జట్టులో భారీ మార్పులు సంభవించాయి.

IPL 2025 Jayawardene Appointed MI Head Coach Mhambrey Returns as Bowling Coach

రోహిత్ శర్మ‌కు బదులుగా హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించారు. అయితే గత సీజన్‌లో ఈ నిర్ణయం జట్టు ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపించింది. పాయింట్ల పట్టికలో ముంబై అట్టడుగన నిలిచింది. మరో రెండు వారాల్లో రిటైన్ లిస్ట్‌ను ప్రకటించినున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం కోచింగ్ బాధ్యతలు జయవర్ధనెకు తిరిగి అప్పగించడం గమనార్హం. కాగా, ముంబై ఫ్యామిలీలో మార్క్ బౌచర్ సభ్యుడిగా కొనసాగుతాడని ముంబై ఇండియన్స్ పేర్కొంది.

''ముంబై ఇండియన్స్‌కు మహేలా జయవర్ధనె తిరిగి కోచ్‌గా రావడం సంతోషంగా ఉంది. గ్లోబల్ టీమ్‌లలో జరిగిన పరిణామాలతో అతను తిరిగి ముంబై ఇండియన్స్‌కు వచ్చాడు. అతని నాయకత్వ లక్షణాలు, జ్ఞానం, ఆటపై ఉన్న అభిమానం ముంబై ఇండియన్స్‌కు ఎప్పుడూ ప్రయోజనకరంగానే ఉంటుంది. గత రెండు సీజన్లలో గొప్ప సేవలు అందించిన మార్క్ బౌచర్‌కు కృతజ్ఞతలు. ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో అతను సభ్యుడిగా కొనసాగుతాడు'' అని ముంబై ఇండియన్స్ పేర్కొంది.

కాగా, టీ20 వరల్డ్ కప్-2024లో భారత జట్టును విజేతగా నిలపడంతో కీలక పాత్ర పోషించిన బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కూడా తిరిగి ముంబై ఫ్రాంచైజీలో చేరనున్నాడు. బౌలింగ్ కోచ్‌గా మాంబ్రే బాధ్యతలు అందుకోనున్నాడు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ రాజస్థాన రాయల్స్‌‌తో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా బౌలింగ్ కోచ్ ముంబైతో జత కట్టాడు.

Story first published: Sunday, October 13, 2024, 17:47 [IST]
Other articles published on Oct 13, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+