For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అర్ధరాత్రి 3 గంటలకు అలా..!': భార్యతో బుమ్రా (లవ్లీ వీడియో వైరల్)

టీమిండియా స్టార్ కపుల్స్ లో బుమ్రా - సంజనా గణేశన్ కూడా ఒకరు. ఎప్పుడూ ఎంతో అన్యోన్యంగా కనపడుతూ ఆదర్శంగా నిలుస్తుంటారు. అయితే తాజాగా ఈ జంట ఓ సరదా ఫన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ర్యాపిడ్ రౌండ్ ఫైర్ మోడ్‌లో దీన్ని నిర్వహించగా.. సంజనా హోస్ట్ గా వ్యవహరించింది . బుమ్రా కంటెస్టెంట్‌గా ఆమె అడిగిన ప్రశ్నలకు టక్కున సమాధానం చెప్పాడు. అలాగే మైదానంలో ఎప్పుడూ సీరియస్ గా కనపడే అతడు.. ఈ ర్యౌపిడ్ రౌండ్ ఫైర్‌లో తన సమాధానాలతో నవ్వులు పూయించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

IPL 2025 Jasprit Bumrah says his 3 AM Friend in Rapid Fire With Wife Sanjana Ganesan
Photo Credit: twitter screenshot

సంజనా: నీ 3 AM ఫ్రెండ్ ఎవరు?
బుమ్రా: ఇంకెవరు నువ్వే. నిజానికి నువ్వు నా కన్నా ముందే పడుకుంటావ్. అందుకే నువ్వు అందుబాటులో లేకపోతే ఆ టైమ్ లో నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతా.

సంజనా: నీలో ఉన్న ఏ కోణాన్ని నీ ఫ్యాన్స్ చూడాలేదు?
బుమ్రా: నేను పలు సందర్భాల్లో చాలా ఫన్నీగా ఉంటాను. కానీ నాలో ఉన్న ఆ కోణాన్ని వారు చూడలేదు. ఎందుకంటే నేను కూడా పబ్లిక్ లో ఉంటే అలా ఫన్నీగా కనిపించను.

సంజనా: నీకు ఏ సూపర్ పవర్ ఉంటే బాగుంటుందని అనుకుంటావ్?
బుమ్రా: ది ఫ్లాష్ లాగా వేగంతా పరిగెత్తడం లేదా హల్క్ లాంటి బలమైన శక్తి.

సంజనా: ఎందుకు వేగంగా పరిగెత్తాలనుకుంటున్నావ్?
బుమ్రా: ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు కదా. అది చాలా బాగుంటుంది.

సంజనా: అప్పుడు ప్రైవేట్ జెట్ కొనుక్కో.
బుమ్రా: నా సూపర్ పవర్ ను నేను డిసైడ్ చేసుకుంటాను.

అలా ఈ సరదా ర్యాపిడ్ రౌండ్ ఫైర్ ప్రశ్నలతో సంజనా - బుమ్రా నవ్వులు పూయిస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను మీరు చూసేయండి..

అప్పుడే ఐపీఎల్‌‪కు బుమ్రా..
బుమ్రా.. ఈ ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్ లకు అందుబాటులో ఉండట్లేదు. అయితే ఎన్ని మ్యాచ్‌లకు దూరమవుతాడనే విషయంపై క్లారిటీ లేదు. ఏప్రిల్ లో అతడు ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది.

Story first published: Friday, March 14, 2025, 16:08 [IST]
Other articles published on Mar 14, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+