ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. మరో పది రోజుల్లో మెగా ఆక్షన్ జరగనుంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్‌ను నిర్వహించనున్నారు. ఏఏ ఆటగాళ్లను సొంతం చేసుకోవాలని పది ఫ్రాంచైజీలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాయి. వేలంలో తమ వ్యూహాలు ఫలించకపోతే బ్యాకప్ ఆప్షన్లను కూడా సిద్ధం చేసుకున్నాయి.
మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే వరుసగా రెండోసారి విదేశాల్లో జరగనున్న ఈ మెగా ఆక్షన్‌లో రూ.641.5 కోట్లు ఖర్చు పెట్టడానికి ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. అన్ని ఫ్రాంచైజీల్లో పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ.110.5 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.41 కోట్లు మాత్రమే ఉన్నాయి.

మొత్తంగా 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 1165 మంది భారత క్రికెటర్లు ఉండగా, 409 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.కాగా, మరో పది రోజుల్లోనే మెగా వేలం ఉండనున్న నేపథ్యంలో దీని గురించి పూర్తి వివరాలు మీ కోసం..
ఫ్రాంచైజీల వద్ద మిగిలిన పర్స్ వాల్యూ, ఆర్‌టీఎమ్ కార్డ్స్, కావాల్సిన ఆటగాళ్ల సంఖ్య
చెన్నై సూపర్ కింగ్స్- రూ. 55 కోట్లు (ఆర్‌టీఎమ్- 01)- 20 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు-07)
ముంబై ఇండియన్స్- రూ. 45 కోట్లు (ఆర్‌టీఎమ్- 01)- 21 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు-08)
కేకేఆర్- రూ. 51 కోట్లు (ఆర్‌టీఎమ్-0)- 19 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -06)
రాజస్థాన్ రాయల్స్- రూ. 41 కోట్లు (ఆర్‌టీఎమ్-0)- 19 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -07)
ఎస్‌ఆర్‌హెచ్- రూ. 45 కోట్లు (ఆర్‌టీఎమ్-0)- 20 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -05)
గుజరాత్ టైటాన్స్-రూ. 69 కోట్లు (ఆర్‌టీఎమ్-01)- 20 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -07)
ఆర్‌సీబీ-రూ. 83 కోట్లు (ఆర్‌టీఎమ్-03)- 22 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -08)
ఢిల్లీ క్యాపిటల్స్-రూ.73 కోట్లు (ఆర్‌టీఎమ్-02)- 21 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -07)
పంజాబ్ కింగ్స్-రూ. 110.5 కోట్లు (ఆర్‌టీఎమ్-04)- 23 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -08)
లక్నో సూపర్ జెయింట్స్-రూ. 69 కోట్లు (ఆర్‌టీఎమ్-01)- 20 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -07)
మెగా వేలం లైవ్ చూడాలంటే ఎలా?
మెగా వేలాన్ని టీవీల్లో చూడాలంటే.. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో వీక్షించాలి. దీనికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే మొబైల్స్, వెబ్‌సైట్స్ చూడాలంటే మాత్రం జియో సినిమా యాప్‌లో చూడాలి. జియో నిమాలో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.