IPL Qualifier-2: ఐపీఎల్ 2025లో క్వాలిఫయర్-2 మ్యాచ్ ఈ రోజు రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును ఓడించడం ద్వారా ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కి చేరుకుంది. పంజాబ్ కింగ్స్ జట్టు క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి పాలవ్వగా.. శ్రేయస్ అయ్యర్ జట్టు ఇప్పుడు క్వాలిఫయర్-2 ఆడాల్సి వచ్చింది. అదే సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు క్వాలిఫయర్-2 కి ముందు భయపడుతున్నాడు.
ముంబై ఇండియన్స్ టెన్షన్ ఎందుకు పెరిగింది?
వాస్తవానికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్డేడియం రికార్డు ముంబై ఇండియన్స్ జట్టును భయపెడుతోంది. ఈ మైదానంలో జట్టు రికార్డు చాలా పేలవంగా ఉంది. ముంబై ఇండియన్స్ చివరిసారిగా 2014లో ఈ మైదానంలో గెలిచింది. ఇప్పటివరకు జట్టు ఇక్కడ 6 మ్యాచ్‌లు ఆడింది. ముంబై 5 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ 11 సంవత్సరాలుగా అహ్మదాబాద్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఎక్కడో ఈ మైదానం జట్టుకు కాస్త దురదృష్ట కర. ఇప్పుడు మరోసారి ముంబై ఇండియన్స్ ఈ మైదానంలో ఐపీఎల్‌లో కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఆ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ముంబై భావిస్తోంది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ జట్టుపై గెలిచి ఈ మొత్తం రికార్డును మెరుగుపరచాలనుకుంటున్నాడు.

ఈ సీజన్‌లో ముంబైని ఓడించిన గుజరాత్ టైటాన్స్
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఈ మైదానంలో గుజరాత్ టైటాన్స్ జట్టుతో తమ చివరి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. దీని తర్వాత లక్ష్య ఛేదనలో ముంబై జట్టు 20 ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసుకున్నాడు.
అదే సమయంలో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై జట్టు గుజరాత్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 50 బంతుల్లో 81 పరుగులు చేశాడు. దీని కారణంగా రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.