Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs DC: టాస్ గెలిచిన గుజరాత్.. తుది జట్లు ఇవే..

GT vs DC: ఐపీఎల్ 2025లో భాగంగా 35వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు అద్భుతంగా రాణించాయి. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ టైటాన్స్ మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

శుభ్‌మన్ గిల్ ఏం చెప్పాడంటే?
టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంటూ శుభ్‌మాన్ గిల్ మాట్లాడాడు. ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నామన్నాడు. ఇక్కడ చాలా వేడిగా ఉండడంతో పాటు వికెట్ చాలా బాగుందన్నారు. మేము జట్టులో పెద్దగా మార్పులు ఏమీ చేయలేదని.. రబాడా 10 రోజుల్లో లేదా అంతకంటే తక్కువ సమయంలో తిరిగి వస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు.

IPL 2025 Gujarat Titans Win Toss Elect to Bowl Full Playing XIs Announced

అక్షర్ పటేల్ ఏం చెప్పాడు?
టాస్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. టాస్ గెలిచి ఉంటే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. చాలా వేడిగా ఉండటం వల్ల తాను అయోమయంలో పడినట్లు చెప్పాడు. బౌలర్లు ఎండలో అలసిపోవచ్చని అన్నాడు. మండే వేడి వారి వ్యూహాన్ని ప్రభావితం చేయవచ్చన్నాడు. తాము బాగా స్కోర్ చేసి డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తామన్నాడు. మేము మంచి ఆరంభాన్ని కోరుకుంటున్నామని.. మెరుగుదల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నామన్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం బాగుందని.. కొన్నిసార్లు విజయం సాధించవచ్చు.. కొన్నిసార్లు అది సాధ్యం కాకపోవచ్చని అన్నాడు.

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI
సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI
అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్.

Story first published: Saturday, April 19, 2025, 15:29 [IST]
Other articles published on Apr 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+