For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH Retention List: నితీశ్‌-అభిషేక్‌కు జాక్‌పాట్.. రిటైన్ లిస్ట్‌ను ప్రకటించిన సన్‌రైజర్స్

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రిటెన్షన్ జాబితా ప్రకటనకు రంగం సిద్ధమైంది. తమ రిటైన్డ్ ప్లేయర్ జాబితా ప్రకటించడానికి ఫ్రాంచైజీలకి బీసీసీఐ ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. ఈ క్రమంలో ఒక్కో ఫ్రాంచైజీ తమ రిటైన్డ్ ప్లేయర్ల జాబితాను వెల్లడిస్తోంది. ఊహించనట్లుగానే గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పదునైన వ్యూహాలతో అయిదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకుంది.

రిటైన్డ్ జాబితాలో హెన్రిచ్ క్లాసెన్‌, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్, తెలుగు యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అయితే దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌కు అత్యధికంగా రూ. 23 కోట్లు వెచ్చించి ఎస్‌ఆర్‌హెచ్ అట్టిపెట్టుకుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరినీ సన్‌రైజర్స్ రిటైన్ చేసుకోలేదు. మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్, సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు గుడ్‌బై చెప్పింది.

IPL 2025 Full List of Sunrisers Hyderabad Retained and Released Players Key Retentions and Surprising Exits

ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుంద్, షాబాజ్ అహ్మద్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ టి నటరాజన్‌లలో ఎవరికీ చోటు దక్కలేదు. అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లును తీసుకోవడంతో ఐపీఎల్ మెగా వేలంలో ఉపయోగించుకోవడానికి సన్‌రైజర్స్ వద్ద ఒక్క ఆర్‌టీఎమ్ కార్డ్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. దాన్ని కూడా అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు మాత్రమే వినియోగించాలి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ లిస్ట్:
హెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లు
ప్యాట్ కమిన్స్- రూ. 18 కోట్లు
అభిషేక్ శర్మ- రూ. 14 కోట్లు
ట్రావిస్ హెడ్- రూ. 14 కోట్లు
నితీశ్ కుమార్ రెడ్డి- రూ. 6 కోట్లు

రిటెన్షన్ ఖర్చు అయిన డబ్బులు: రూ. 75 కోట్లు
పర్స్‌లో మిగిలి ఉన్న డబ్బులు: రూ. 45 కోట్లు

ఎస్ఆర్‌హెచ్ రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా:
రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, విజయ్‌కాంత్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, ఎయిడెన్ మార్క్‌రమ్, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, జయదేవ్ ఉనద్కత్, మార్కో జేన్సన్, మయాంక్ మార్కండే, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేందర్ యాదవ్, జాత్‌వేద్ సుబ్రమణ్యన్, ఫజల్లా ఫరూకీ, ఆకాశ్ మహరాజ్ సింగ్, హసరంగ.

Story first published: Thursday, October 31, 2024, 17:51 [IST]
Other articles published on Oct 31, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+