Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025 Retention: 5గురు కెప్టెన్లు ఔట్.. ఫ్రాంచైజీలు వదులుకున్న టాప్ ప్లేయర్లు వీళ్లే!

ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిటెన్షన్ ప్లేయర్ల జాబితా ఆదివారం విడుదలైంది. ఆటగాళ్ల సామర్థ్యాన్ని అంచనా వేస్తూ, ఆర్థిక వ్యూహాలతో పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించింది. ఊహించినట్లుగానే కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధికంగా ఆరుగురు ప్లేయర్లను, పంజాబ్ కింగ్స్ అత్యల్పంగా ఇద్దరిని మాత్రమే అట్టిపెట్టుకుంది. ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్‌లోనూ సీఎస్కేలో కొనసాగనున్నాడు.

అయితే ఈసారి అనూహ్యంగా అయిదు ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లను వదులుకుంది. గత సీజన్‌లో జట్టును విజేతగా నిలబెట్టిన తమ సారథి శ్రేయస్ అయ్యర్‌ను కూడా కేకేఆర్ వదులుకోవడం గమనార్హం. ఇక లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్‌‌ను కూడా ఆయా ఫ్రాంచైజీలు వదులుకున్నాయి.

IPL 2025 Full List of Released Players Five Captains and Big Names Heading to the Auction

అంతేగాక, స్టార్ ప్లేయర్లను కూడా కొన్ని ఫ్రాంచైజీలు రిలీజ్ చేశాయి. కెప్టెన్లు కాకుండా... అర్షదీప్ సింగ్ (పంజాబ్ కింగ్స్), ఇషాన్ కిషన్ (ముంబై ఇండియన్స్), మహ్మద్ షమి (గుజరాత్ టైటాన్స్), యుజువేంద్ర చాహల్ (రాజస్థాన్ రాయల్స్), రవిచంద్రన్ అశ్విన్ (రాజస్థాన్ రాయల్స్), వాషింగ్టన్ సుందర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్స్), శార్దూల్ ఠాకూర్ (చెన్నై సూపర్ కింగ్స్), దీపక్ చాహర్ (పంజాబ్ కింగ్స్) మెగా వేలంలో రూ.కోట్లు పలికే అవకాశం ఉంది.

ఇక విదేశీ ప్లేయర్లలో జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), క్వింటన్ డికాక్ (లక్నో సూపర్ జెయింట్స్), ఫాప్ డుప్లెసిస్ (ఆర్సీబీ), లివింగ్‌స్టోన్ (పంజాబ్ కింగ్స్), సామ్ కరన్ (పంజాబ్ కింగ్స్), మిచెల్ స్టార్క్ (కేకేఆర్), హేజిల్‌వుడ్, రబాడ (పంజాబ్ కింగ్స్), ఫిల్ సాల్ట్ (కేకేఆర్)‌లపై కాసుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. కాగా, ఫ్రాంచైజీలు వదులుకున్న పూర్తి ఆటగాళ్ల జాబితా మీ కోసం..

ఎస్ఆర్‌హెచ్ రిలీజ్ చేసిన ప్లేయర్లు
రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, విజయ్‌కాంత్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, ఎయిడెన్ మార్క్‌రమ్, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, జయదేవ్ ఉనద్కత్, మార్కో జేన్సన్, మయాంక్ మార్కండే, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేందర్ యాదవ్, జాత్‌వేద్ సుబ్రమణ్యన్, ఫజల్లా ఫరూకీ, ఆకాశ్ మహరాజ్ సింగ్, హసరంగ

ముంబై రిలీజ్ చేసిన ప్లేయర్లు
డెవాల్డ్ బ్రెవిస్, ఇషాన్ కిషన్, టీమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, మహమ్మద్ నబీ, రోమారియో షెఫెర్డ్, షామ్స్ ములానీ, నెహాల్ వధేరా, గెరాల్డ్ కోయిట్జీ, అన్షుల్ కంబోజ్, నమన్ ధిర్, శివలిక్ శర్మ, క్వెన మఫకా, పియూష్ చావ్లా, కుమార్ కార్తీకేయా సింగ్, ఆకాశ్ మధ్వాల్, లూక్ వుడ్, దిల్షాన్ మదుషంక, శ్రేయస్ గోపాల్, నువాన్ తుషారా

సీఎస్కే రిలీజ్ చేసిన ప్లేయర్లు
రచిన్ రవీంద్ర, అజింక్య రహానె, డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, సమీర్ రిజ్వీ, దీపక్ చాహర్, మహేష్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మన్, తుషార్ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, నిశాంత్ సిద్ధు, మొయిన్ అలీ, మిచెల్ శాంట్నర్, జాదవ్ మండల్, ప్రశాంత్ సోలంకి, ముకేశ్ చౌదరి, సిమర్జీత్ సింగ్, హంగర్గేకర్, అరవెల్లి అవినాశ్

కేకేఆర్ రిలీజ్ చేసిన ప్లేయర్లు
శ్రేయస్ అయ్యర్, రెహ్మనుల్లా గుర్బాజ్, నితీష్ రాణా, షెర్ఫేన్ రూథర్‌‌ఫోర్డ్, ఫిల్ సాల్ట్, కేఎస్ భరత్, మనీష్ పాండే, అంగ్‌క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, సుయాష్ శర్మ, అల్లా ఘజన్‌ఫర్, దుష్మంత్ చమీరా, షకీబ్ హుస్సేన్, వైభవ్ అరోరా, మిచెల్ స్టార్క్, చేతన్ సకారియా

ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన ప్లేయర్లు
రిషభ్ పంత్, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షై హోప్, రికీ భుయ్, సుమిత్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, విక్కీ ఓస్తవల్, ప్రవీణ్ దూబె, పృథ్వీ షా, లలిత్ యాదవ్, అన్రిచ్ నోకియా, జే రిచర్డసన్, రసిక్ దర్ సలామ్, కుమార్ కుశాగ్ర, యశ్ దుల్, స్వస్తిక్ చికార

ఆర్‌సీబీ రిలీజ్ చేసిన ప్లేయర్లు
ఫాఫ్ డుప్లెసిస్, అనూజ్ రావత్, దినేశ్ కార్తీక్(రిటైర్మెంట్), సుయాష్ ఎస్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, సౌరవ్ చౌహన్, మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్, మయాంక్ దగర్, మనోజ్ భాండగే, స్వప్నిల్ సింగ్, ఆకాశ్ దీప్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ సిరాజ్, టామ్ కరణ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రజన్ కుమార్, విజయ్ కుమార్ వైశాఖ్

లక్నో సూపర్ జెయింట్స్ రిలీజ్ చేసిన ప్లేయర్లు
కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్య, మార్కస్ స్టొయినిస్, నవీనుల్ హక్, యశ్ ఠాకూర్, దీపక్ హుడా, మయాంక్ యాదవ్, అమిత్ మిశ్రా, ప్రెరాక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్, శివమ్ మావి, షామర్ జోసెఫ్, డేవిడ్ విల్లీ, కైల్ మేయర్స్, ఆస్టన్ టర్నర్, సిద్ధార్థ్, యుద్వీర్ సింగ్, అర్షద్ ఖాన్, అర్షిన్ కులకర్ణి

పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్లు
అశుతోష్ శర్మ, అర్షదీప్ సింగ్, శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కరన్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, హర్‌ప్రీత్ బార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, రిలే రోసో, తనయ్ త్యాగరాజన్, హర్‌ప్రీత్ సింగ్, విద్వాత్ కవెరప్ప, సికందర్ రజా, నాథన్ ఎలిస్, శివమ్ సింగ్, క్రిస్ వోక్స్, రిషి ధావన్, అథర్వ, ప్రిన్స్ చౌదరి, విశ్వనాథ్ సింగ్

గుజరాత్ టైటాన్స్ రిలీజ్ చేసిన ప్లేయర్లు
వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, సాయి కిశోర్, స్పెన్షర్ జాన్సన్, మహ్మద్ షమి, శరత్, మోహిత్ శర్మ, అభినవ్ మనోహర్, నూర్ అహ్మద్, మానవ్ సుతార్, జోషువా లిటిల్, కేన్ విలియమ్సన్, మాథ్యూ వేడ్, జయంత్ యాదవ్, సందీప్ వారియర్, దర్శన్, కార్తీక్ త్యాగి, సుశాంత్ శర్మ

రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ లిస్ట్
జోస్ బట్లర్, డోనోవన్ ఫెర్రెరియా, కునల్ రాథోర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవ్‌దీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ఆవేశ్ ఖాన్, రోవ్‌మన్ పోవెల్, శుభ్‌మ్ దుబే, టామ్ కోహ్లేర్-కాడ్‌మోర్, అబిడ్ ముష్తక్, నండ్రే బర్గర్, తనూష్ కోటియన్, కేశవ్ మహరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆడమ్ జంపా.

Story first published: Thursday, October 31, 2024, 20:42 [IST]
Other articles published on Oct 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+