క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రిటెన్షన్ జాబితా ప్రకటనకు రంగం సిద్ధమైంది. తమ రిటైన్డ్ ప్లేయర్ జాబితా ప్రకటించడానికి ఫ్రాంచైజీలకి బీసీసీఐ ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. ఈ క్రమంలో ఒక్కో ఫ్రాంచైజీ తమ రిటైన్డ్ ప్లేయర్ల జాబితాను వెల్లడిస్తోంది. ఊహించనట్లుగానే ఢిల్లీ క్యాపిటల్స్ పదునైన వ్యూహాలతో నలుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకుంది.
కెప్టెన్ రిషభ్ పంత్‌కు అవకాశం ఇవ్వలేదు. అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్‌ను రిటైన్ చేసుకుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ అభిషేక్ శర్మను అట్టిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో మూడు ఆర్‌టీఎమ్ కార్డ్‌లతో మెగావేలంలో తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంది. కాగా, అక్షర్ పటేల్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ అత్యధికంగా రూ.16.5 కోట్లు వెచ్చించింది.

ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ లిస్ట్:
అక్షర్ పటేల్- రూ.16.5 కోట్లు
కుల్‌దీప్ యాదవ్- రూ.13.25 కోట్లు
ట్రిస్టన్ స్టబ్స్- రూ.10 కోట్లు
అభిషేక్ శర్మ- రూ.4 కోట్లు
రిటెన్షన్ ఖర్చు అయిన డబ్బులు: రూ. 43.75 కోట్లు
పర్స్‌లో మిగిలి ఉన్న డబ్బులు: రూ. 76.25 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా:
రిషభ్ పంత్, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షై హోప్, రికీ భుయ్, సుమిత్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, విక్కీ ఓస్తవల్, ప్రవీణ్ దూబె, పృథ్వీ షా, లలిత్ యాదవ్, అన్రిచ్ నోకియా, జే రిచర్డసన్, రసిక్ దర్ సలామ్, కుమార్ కుశాగ్ర, యశ్ దుల్, స్వస్తిక్ చికార.