Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షారుక్ ఖాన్‌పై దాదా ఫ్యాన్స్ ఫైర్.. 5 నిమిషాల్లో 400 మెసేజ్‌లు!

ఐపీఎల్‌లో సెకండ్ మోస్ట్ సక్సస్ ఫుల్ జట్టు అంటే కో‌ల్‌కతా నైట్‌ రైడర్స్‌కు (కేకేఆర్‌). ఐపీఎల్ హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ (చెరో ఐదు సార్లు విజేతగా) తర్వాత మూడు సార్లు ట్రోఫీని ముద్దాడిందీ జట్టు. అయితే కేకేఆర్ ఫ్రాంఛైజీ ఓనర్, హీరో షారుక్ ఖాన్ పై.. మాజీ కెప్టెన్ గంగూలీ ఫ్యాన్స్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. 5 నిమిషాల్లో 400 మెసేజ్ లో చేశారు. అసలేం జరిగిందంటే?

గతేడాది ఐపీఎల్ 2024 విజతేగా నిలిచిన కేకేఆర్ కు అంత ఈజీగా రాలేదు. ఈ ఫ్రాంఛైజీ తొలి మూడు సీజన్లలో కనీసం ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్ కు చేరుకేలేకపోయింది. అప్పుడు గంగూలీనే ఈ జట్టుకు సారథి. దీంతో గంగూలీ కెప్టెన్సీపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే కేకేఆర్.. 2011 మెగా ఆక్షన్ లో దాదాను రిటైన్ కూడా చేసుకోలేదు. మెగా వేలంలో అతడి కోసం బిడ్డింగ్‌ వేయలేదు.

IPL 2025 Former KKR Director reveals on Sharukh khan Role in Sourav Ganguly s exit

దీంతో దాదా ఫ్యాన్స్ తీవ్రంగా అసంతృప్తి చెందారు. కేకేఆర్ యాజమాన్యంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే అప్పుడు చోటు చేసుకున్న అనుభవాలను గురించి తాజాగా కేకేఆర్‌ మాజీ డైరెక్టర్‌ జాయ్ భట్టాచార్య తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... దాదా అభిమానుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయినట్లు గుర్తు చేసుకున్నారు. దాదాను తీసుకోవాలా వద్దా అనే నిర్ణయంలో కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ పాత్ర కూడా ఉన్నట్లు చెప్పారు.

"గంగూలీ కోసం బిడ్ కూడా వేయలేదు. దీంతో ఐదు నిమిషాల్లో నాకు 400 మెసేజ్ లు వచ్చాయి. మన బెంగాలీ ఐకాన్ ను మోసం చేసిన బెంగాలీ ఇతడు అంటూ గ్రూప్స్ లో నా గురించి మెసేజ్ లు ఫార్వాడ్ చేశారు. దీని తీవ్రత ఏ స్థాయికి చేరిందంటే, మా నాన్న గారికి కాల్ చేసి సాల్ట్‌లేక్‌లో ఉన్న మా ఇంటి దగ్గర ఉన్న నా అడ్రెస్ బోర్డును కూడా తీసేయమన్నాను. ఆ సమయంలో దాదాను రిటైన్ చేసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకోవడంలో షారుక్ ఖాన్ పాత్ర కూడా ఉంది. ఆయన ఫ్రాంఛైజీలోని ఉన్నతాధికారులతో.. గంగూలీని కావాలంటే తీసుకోండి, లేదంటే వదిలేయండి, మీ ఇష్టం అని చెప్పారు. అప్పుడు నేను, కోచ్, సీఈఓ అక్కడ ఉన్నాం." అని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

Story first published: Wednesday, February 12, 2025, 17:48 [IST]
Other articles published on Feb 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+