Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: మరో జట్టుకు కోచ్‌గా పాంటింగ్.. ఈ ఫ్రాంచైజీ ఢిల్లీ కంటే దరిద్రం!

మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. జట్టును బలోపేతంగా నిర్మించుకోవాలని ఫ్రాంచైజీలన్నీ పదునైన వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిటైన్డ్ ప్లేయర్ల జాబితాను, వేలంలో దక్కించుకోవాల్సిన ఆటగాళ్ల లిస్ట్‌ను సిద్ధం చేస్తున్నాయి. అంతేగాక కోచింగ్ స్టాఫ్‌ను మార్చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌కు రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడు.

అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌ వదులుకున్న ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ను మరో ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా నియమించుకోవాలని భావిస్తోంది. అదే పంజాబ్ కింగ్స్. ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో పాటు పంజాబ్ కింగ్స్‌ కప్ కల అందని ద్రాక్షగానే మిగిలి ఉన్న విషయం తెలిసిందే. అయితే పాంటింగ్ అనుభవంతో ఈ సారి కప్‌ను ముద్దాడాలని పంజాబ్ ఫ్రాంచైజీ భావిస్తోంది. పాంటింగ్‌తో చర్చలు కూడా ప్రారంభించింది.

IPL 2025 Former Delhi Capitals Coach Ricky Ponting Set to Join Punjab Kings

పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలోకి పాంటింగ్ కూడా అడుగుపెట్టాలని భావిస్తున్నాడని సమాచారం. ఒప్పందానికి పంజాబ్ యాజమాన్యం-పాంటింగ్ అతి దగ్గరగా ఉన్నారని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ కూడా పేర్కొంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు పాంటింగ్ ఏడేళ్లు కోచ్ బాధ్యతలు నిర్వర్తించాడు. పాంటింగ్ హయాంలో ఢిల్లీ 2019, 2020, 2021 సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అంతేగాక ఆ జట్టు తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. 2020లో టైటిల్ పోరుకు వెళ్లిన ఢిల్లీ రన్నరప్‌గా నిలిచింది.

ఇక పంబాజ్ కింగ్స్ ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్‌ను తప్పించనున్నారని గత నెలలో వార్తలు చక్కర్లుకొట్టిన విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో భారతీయ కోచ్‌ను నియమించుకోవాలని పంజాబ్ ఫ్రాంచైజీ భావించింది. పంజాబ్ కొత్త కోచ్ సంజయ్ బంగర్‌ అని పుకార్లు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు రికీ పాంటింగ్‌ అనుభవం వైపు ఫ్రాంచైజీ మొగ్గు చూపుతుంది. ఇక ట్రెవర్ బేలిస్ కోచింగ్‌లో పంజాబ్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగించింది. 2023 సీజన్‌లో పంజాబ్ ఎనిమిదో స్థానం, 2024 సీజన్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

కాగా, ఐపీఎల్ చరిత్రలో అత్యంత పేలవమైన రికార్డు పంజాబ్ కింగ్స్‌ పేరిట ఉంది. ఇప్పటివరకు పంజాబ్ కేవలం రెండు సార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరింది. గత పది సీజన్లుగా లీగ్ దశలోనే ఇంటిముఖం పడుతుంది. 2014లో రన్నరప్‌గా నిలవడమే పంజాబ్ అత్యుత్తమ ప్రదర్శన. మూడు సీజన్లలో పాయింట్ల పట్టికలో అట్టుడగున నిలిచింది. ఈ ఏడాది జరిగిన సీజన్‌లో తమ సారథి శిఖర్ ధావన్ దూరమవ్వడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. మరి, రికార్డుల్లో ఇంత పేలవంగా ఉన్న పంజాబ్‌‌ను పాంటింగ్ ఎలా తీర్చిదిద్దుతాడో చూడాలి!!

Story first published: Wednesday, September 18, 2024, 14:48 [IST]
Other articles published on Sep 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+