Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఆడడానికి కాదు వీళ్లు వచ్చింది.. హాలిడే కోసమే!

Virender Sehwag: భారత్‌తో పాటు చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎళ్ 2025లో పాల్గొంటున్నారు. ప్రపంచ స్టార్ ఆటగాళ్లతో నిర్వహిస్తున్న ఈ లీగ్ లో దాదాపు సగం మ్యాచ్‌లు జరిగాయి. చాలా మంది విదేశీ ఆటగాళ్లు తమ జట్ల తరపున బాగా రాణిస్తున్నారు. అయితే చాలా మంది ఆటగాళ్లు నిరాశపరుసుతున్నారు. కొంత మంది విదేశీ ఆటగాళ్లు తమ సెలవులను ఆస్వాదించడానికే ఐపీఎల్ ఆడుతున్నారని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ ఆటగాళ్లు లియామ్ లివింగ్‌స్టోన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లను మందలించాడు.

తన కోపాన్ని బయటపెట్టిన వీరేంద్ర సెహ్వాగ్
ఐపీఎల్ 2025 సందర్భంగా క్రిక్‌బజ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. మ్యాక్స్‌వెల్ , లివింగ్‌స్టోన్ ల ఆకలి తీరిపోయిందని తాను భావిస్తున్నానన్నారు. "వాళ్లు ఇక్కడికి సెలవులు ఆస్వాదించేందుకే వస్తారు. వాళ్లు వస్తారు, ఆనందించి వెళ్లిపోతారు. జట్టు కోసం పోరాడాలనే కోరిక కనిపించడం లేదు. నేను చాలా మంది మాజీ ఆటగాళ్లుతో సమయం గడిపాను. కానీ కేవలం ఒక్కరిద్దరి ఆటగాళ్ల ఆట మాత్రమే నాకు అర్థమయ్యేలా చేసి. జట్టు కోసం ఏదైనా చేయాలనే తపన కనిపించడం లేదు." అని సెహ్వాగ్ అన్నాడు.

IPL 2025 Foreign Stars Here for Holidays Not Cricket Sehwag Slams Maxwell and Livingstone

ఆ ఇద్దరి ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంది?
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ పెద్దగా ఏమీ చేయలేదు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో మ్యాక్సీ తన బ్యాటింగ్‌తోనే కాకుండా బౌలింగ్ తో కూడా నిరాశపరిచాడు. బ్యాటింగ్‌లో 6 మ్యాచ్‌ల్లో 8.20 సగటుతో 41 పరుగులు చేశాడు. ఈ సమయంలో మ్యాక్సీ స్ట్రైక్ రేట్ కూడా 100 మాత్రమే ఉంది. మరోవైపు, లియామ్ లివింగ్‌స్టోన్ కూడా ఆర్సీబీ తరపున బాగా రాణించలేకపోయాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో, అతను 1 అర్ధ సెంచరీ సహాయంతో 87 పరుగులు చేశాడు.

ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు..
ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను వేలం వేసింది. పంజాబ్ మాక్సీని రూ.4.2 కోట్లకు వేలంలో కొనుగోలు చేయడం ద్వారా తమ జట్టులో భాగం చేసుకోగా, ఆర్సీబీ లియామ్ లివింగ్‌స్టోన్‌పై రూ.8.75 కోట్లు ఖర్చు చేసింది.

Story first published: Sunday, April 20, 2025, 19:04 [IST]
Other articles published on Apr 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+