For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ కప్ కొడుతుంది: మాజీ ప్లేయర్లు

RCB vs PBKS: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు(జూన్ 3) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లేదా పంజాబ్ కింగ్స్ రూపంలో ఐపీఎల్ తన కొత్త ఛాంపియన్‌ ను పొందనుంది. 18 సంవత్సరాలుగా తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. రెండు జట్లు అద్భుత ఫామ్‌కు చేరుకున్నాయి. రెండు జట్లూ టైటిల్ గెలవడానికి ఫేవరెట్లుగా ఉన్నాయి. ఇది పంజాబ్ జట్టు రెండో ఫైనల్ కాగా.. ఆర్సీబీకి నాలుగో ఫైనల్. ఈ కీలక మ్యాచ్‌కు ముందు శ్రీలంక దిగ్గజం తిలకరత్నే దిల్షాన్ కీలక ప్రకటన చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో తాను ఏ జట్టుకు మద్దతు ఇస్తున్నానో చెప్పాడు.

తిలకరత్నే దిల్షాన్ ఏ జట్టుకు మద్దతు ఇస్తున్నాడు?
ఐపీఎల్ 2025 ఫైనల్‌లో తిలకరత్నే దిల్షాన్ ఆర్సీబీ జట్టుకు మద్దతు ఇస్తున్నాడు. దిల్షాన్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. "ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఈ ఏడాది ఆర్సీబీ గెలవాలని కొన్ని మీడియా సంస్థలకు చెప్పాను. వారు టోర్నమెంట్ అంతటా చాలా బాగా రాణించారని భావిస్తున్నాను. ఈ సారు వారు గెలవగలరని ఆశిస్తున్నాను. విరాట్ కోహ్లీ, ఆర్సీబీ జట్టుకు నా శుభాకాంక్షలు" అని తిలకరత్నే దిల్షాన్ పేర్కొన్నాడు. దిల్షాన్ 2011 నుంచి 2013 వరకు ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడనే సంగతి తెలిసిందే. దిల్షాన్ ఐపీఎల్ కెరీర్ గురించి చెప్పాలంటే.. అతను 52 మ్యాచ్‌లలో 1153 పరుగులు చేశాడు.

IPL 2025 Final Dilshan and Gibbs Back RCB to Win Their First IPL Title

ఆర్సీబీకి మద్దతు ఇచ్చిన హెర్షెల్ గిబ్స్
దక్షిణాఫ్రికా అనుభవజ్ఞుడైన క్రికెటర్ హెర్షెల్ గిబ్స్ కూడా ఫైనల్‌లో ఆర్సీబీకి మద్దతు ఇస్తున్నాడు. ది లెజెండ్-జెడ్ టీ10 లీగ్ సందర్భంగా గిబ్స్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.."పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తే ఆర్సీబీ ఆ స్కోరును ఛేదిస్తుంది. నేను ఆర్సీబీకి మద్దతు ఇస్తున్నాను. ఇది గొప్ప మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాను. క్రికెట్‌ను ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఆర్సీబీ కనీసం ఒక టైటిల్ గెలవడం చూడాలని అనుకుంటున్నాను. దీనికి వారికి చాలా సమయం పట్టింది." అంటూ గిబ్స్ పేర్కొన్నాడు. హెర్షెల్ గిబ్స్ 2008 నుంచి 2012 వరకు ఐపీఎల్‌లో 36 మ్యాచ్‌లు ఆడి 886 పరుగులు చేశాడు.

Story first published: Tuesday, June 3, 2025, 9:27 [IST]
Other articles published on Jun 3, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+