Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఆడి కొడుకొచ్చాడని చెప్పు..!!

ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే తాజాగా రికీ.. తన కొడుకు ఫ్లెచర్ విలియమ్ పాంటింగ్ తో కలిసి మైదానంలో నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఎందుంటే ఈ వీడియోలో పాంటింగ్ తన కొడుకుతో ప్రాక్టీస్ చేయిస్తుండగా.. ఆ చిన్నోడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రికీ బంతులను సంధిస్తుంటే.. ఫ్లెచర్ స్ట్రైకింగ్ షాట్స్ ఆడుతూ, డిఫెండింగ్ ఆడుతూ ఆకట్టుకున్నాడు. ఈ వీడియోను పోస్ట్ చేసిన పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ.. ఫాదర్, సన్, క్రికెట్. ఏ బాండ్ బియాండ్ జనరేషన్ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ యంగ్ రికీ పాంటింగ్ బ్యాటింగ్ తో అదరగొడున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

ఇదేం తొలి సారి కాదు...
అయితే రికీ పాంటింగ్.. తన కొడుకుతో కలిసి ప్రాక్టీస్ చేయడం ఇదేం తొలిసారి కాదు. గత సీజన్ లోనూ ఐపీఎల్ సమయంలో వీరిద్దరు మైదానంలో నెట్ ప్రాక్టీస్ చేశారు. అప్పుడు పాంటింగ్.. దిల్లీ క్యాపిటల్స్ కు కోచ్ గా వ్యవహరించాడు. అప్పుడు పంత్ దీనిపై స్పందిస్తూ.. భవిష్యత్ లో ఈ చిన్నోడు దిల్లీ క్యాపిటల్స్ కు ఆడొచ్చు అని అన్నాడు. కాగా, రికీ పాంటింగ్ కు కొడుకు ఫ్లెచర్ మాత్రమే కాదు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. వారి పేర్లు ఎమ్మీ చార్లెట్, మటిస్సీ ఎల్లీ.

IPL 2025 Fans Impressed PBKS Head Coach Ricky Ponting playing cricket with his son in the nets

నెక్ట్స్ మ్యాచ్ అప్పుడే..
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ విషయానికొస్తే.. ఇప్పటివరకు ఓ మ్యాచ్ ఆడింది. అందులో విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ (42 బంతుల్లో 97నాటౌట్, 5x4 6x9) అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు. తన తదుపరి మ్యాచును ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడనుంది.

Story first published: Sunday, March 30, 2025, 13:24 [IST]
Other articles published on Mar 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+