వైభవ్ సూర్యవంశీ మోసం చేశాడా? - వయసు 14 కాదా? - అసలు నిజమిదే!
Vaibhav Suryavanshi Age Fraud Allegations: వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరును క్రికెట్ అభిమానులు అస్సలు మరిచిపోలేరు. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులో 14 ఏళ్ల ఈ బుడ్డోడు.. ఐపీఎల్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత క్రికెటర్ గా నిలిచాడు. కేవలం 35 బంతుల్లోనే శతకం బాది.. టీ20ల్లో సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్ గానూ నిలిచాడు. ఇంకా పలు రికార్డును కూడా అందుకున్నాడు.
అయితే వైభవ్ బ్యాటింగ్ స్కిల్స్, సిక్సర్ల హిట్టింగ్ చూసి యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇదే సమయంలో పలు అనుమానాలను లేవనెత్తింది. నిజంగానే వైభవ్ వయసు 14 ఏళ్లేనా అన్న ప్రశ్నలు చాలా మంది మదిలో తిరిగాయి. ఎందుకంటే క్రికెట్ ప్రపంచంలో పలువురు ఆటగాళ్లు తమ వయసు దాచి, పట్టుబడినవారు ఉన్నారు. పైగా వైభవ్ స్వరాష్ట్రం అయిన బిహార్ లోని పలువురు క్రికెటర్లు కూడా వయసు దాచి మోసం చేసిన వాళ్లు ఉన్నారు! అందుకే చాలా మందికి వైభవ్ వయసుపై అనుమానం తలెత్తింది.
ఈ నేపథ్యంలో వైభవ్ వయసు నిజంగానే 14 ఏళ్లు అని నిరూపించే ఫొటోలను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ పిక్స్ అతడి వయసును నిర్ధారిస్తున్నాయి. మొదటి పిక్.. 2017లో దిగింది. ఆ సమయంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్పీఎస్ - కేకేఆర్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచుకు తండ్రితో కలిసి హాజరయ్యాడు వైభవ్. అప్పుడు అతడి వయసు 6 ఏళ్లు. ఇదే విషయాన్ని అప్పటి ఆర్పీఎస్ యజమాని గోయెంకా స్పష్టం చేశారు. ఈ ఫొటోను కూడా ఆయనే పోస్ట్ చేశారు. మరో ఫొటోలో వైభవ్ ఓ ట్రిప్ లో ఉన్నాడు. అప్పుడు అతడి వయసు 9 ఏళ్లు. ఇంకో ఫొటోలో వైభవ్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు పట్టుకుని ఉన్నాడు. ఇది 2022లో దిగింది. అప్పుడు అతడి వయసు 11 ఏళ్లు. ఈ ఫొటోలన్నీ గమినిస్తే అతడి వయసు ఇప్పుడు 14 ఏళ్ల నిజమేనని అర్థమవుతుంది.

బీసీసీఐ బోన్ టెస్ట్ రిపోర్ట్ ఏంటంటే?
వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ.. తన కొడుకు వయసు గురించి వస్తోన్న ఆరోపణలను ఖండించాడు. బీసీసీఐ అఫీషియల్ గా వైభవ్ కు 8 ఏళ్ల వయసులో బోన్ టెస్ట్ నిర్వహించి వయసు కరెక్టేనని కన్ఫామ్ చేసిందని చెప్పాడు.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications