Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat VS Shreyas: ఎంతకు తెగించార్రా.. నమ్మితే ఇంత మోసం చేస్తారా!?

Virat kohli VS Shreyas Iyer: ఆర్సీబీని దాని సొంతగడ్డపైనే ఓడించాక పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ కాస్త గట్టిగానే సంబరాలు చేసుకున్నాడు. మరి అది చూసిన విరాట్ కోహ్లీ ఊరుకుంటాడా? దానికి గట్టిగానే ప్రతీకారం తీర్చుకున్నాడు. ఏప్రిల్ 20న పంజాబ్‌ కింగ్స్ ను దాని సొంతగడ్డపైనే ఆర్సీబీ ఓడించడంలో కీలకంగా వ్యవహరించి రెచ్చిపోయాడు. విజయానంతరం శ్రేయస్‌ వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ సంబరాలు కూడా చేసుకున్నాడు. దీంతో శ్రేయస్‌ కాస్త నొచ్చుకున్నట్లే కనిపించాడు. ఇదంతా కాంట్రవర్సీకి దారీ తీసింది. ముఖ్యంగా ఈ వ్యవహారంతో శ్రేయస్ అయ్యర్ పై హేట్ బాగా క్రియేట్ అయింది. సీనియర్ కోహ్లీతో మొదటగా శ్రేయస్ అలా ఎందుకు వ్యవహరించాలి అంటూ చాలా మంది ప్రశ్నించారు. దానికి విరాట్ సరైన బుద్ధి చెప్పాడంటూ కామెంట్లు చేశారు.

ఇదంతా తెలిసిన విషయమే కదా, సోషల్ మీడియాలో దీన్ని చూసేశాం.. ఇప్పుడెందుకు చెబుతున్నారు అని అనుకుంటున్నారా? అయితే కంటికి కనిపించిన ఇదంతా అబద్ధం అని తెలిసింది. ఇదంతా కొంతమంది ట్రోలర్స్.. క్రికెట్ అభిమానులను తప్పుదోప పట్టించేందుకు చేసిన ప్రయత్నమిది. అవును మీరు చదువుతోంది నిజం. ఈ విషయం తెలీక చాలా మంది నిజంగానే కోహ్లీ-అయ్యర్ మధ్య ఏదో గొడవ జరిగినట్లు నమ్ముతున్నారు. వాస్తవానికి అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

IPL 2025 Fact check Virat Kohli Shreyas Iyer controversial Revenge celebration is fake

అసలు జరిగిందేంటంటే?
శ్రేయస్ అయ్యర్ చేసుకున్న సంబరాలు నిజమే. కానీ అది ఆర్సీబీపై కాదు. కేకేఆర్ పై లోయెస్ట్ టోటల్ డిఫెండ్ చేశాక శ్రేయస్ అయ్యర్ అలా సంబరాలు చేసుకున్నాడు. ముల్లాన్‌పుర్‌లో ఏప్రిల్ 15న ఈ మ్యాచ్ జరిగింది. ఆ వీడియోను ఎడిట్ చేసి, ఆర్సీబీపై అయ్యర్ అలా చేశాడంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. కానీ ఐపీఎల్ అఫీషియల్ పేజ్ చెక్ చేస్తే.. అసలు విషయం బయట పడింది. ఐపీఎల్ పేజులో ఏప్రిల్ 15న కేకేఆర్ పై శ్రేయస్ ఆ సంబరాలు చేసుకున్నట్లు పక్కాగా వీడియో ఆధారం ఉంది. కాబట్టి ఈ కాంట్రవర్సీ సెలబ్రేషన్స్ లో శ్రేయస్ అయ్యర్ తప్పేమీ లేదు.

ఇది తెలుసో తెలీకో.. ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా శ్రేయస్ అయ్యర్ ను తప్పుబడుతున్నారు. వైరల్ అవుతోన్న మిస్ లీడ్ రీల్ ను మరింత స్ప్రెడ్ చేస్తూ లేని పోని అపోహలు సృష్టిస్తున్నారు. దీంతో చాలా మంది క్రికెట్ అభిమానులు.. విరాట్ కోహ్లీ - శ్రేయస్ అయ్యర్ మధ్య నిజంగానే మనస్ఫర్థలు వచ్చాయని అనుకుంటున్నారు. ఏదేమైనా ఈ మిస్ లీడ్ రీల్ వల్ల.. మన ఇండియన్ ప్లేయర్స్ పై హేట్ క్రియేట్ అవుతోంది. ముఖ్యంగా కోహ్లీ - శ్రేయస్ అయ్యర్ ఫ్రెండ్ షిప్‌ను తప్పుగా అనుకుంటున్నారు. నిజానికి వారిద్దరు చాలా మంచి స్నేహితులు. మ్యాచ్ అయ్యాక కూడా వారిద్దరు ఎంతో కలిసి మెలిసి ఉన్నారు. ఇక కోహ్లీ విషయానికొస్తే.. అతడు ఎప్పటిలాగే సరదాగా చేసుకున్న సెలబ్రేషన్స్ తప్ప.. శ్రేయస్ అయ్యర్ పై రివెంజ్ కాదని తెలిసింది.

Story first published: Monday, April 21, 2025, 18:32 [IST]
Other articles published on Apr 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+