Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ముంబై జట్టులోకి బెన్ స్టోక్స్?

IPL 2025: ఐపీఎల్‌లో మొదట తడబాటుకు గురికావడం, ఓటములను అందుకోవడం.. ఆ తర్వాత విజయాల బాట పట్టడం ముంబై ఇండియన్స్ ను అలవాటే. మొన్నటివరకు టాప్‌-4లోకి ముంబయి వస్తుందా? అనే అనుమానాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని పటాపంచలు చేస్తూ ముందుకొస్తోంది ముంబై. ఈ సీజన్‌లో ముంబై 9 మ్యాచుల్లో ఐదు విజయాలు అందుకుంది. తొలి ఐదింట్లో ఒకటే గెలుపు. కానీ, ఆ తర్వాత నాలుగుకు నాలుగింట్లో గెలుపొంది అంచనాలను పెంచింది. అయితే ఈ క్రమంలో ఆ జట్టులోకి ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వచ్చి చేరనున్నట్లు కొత్త ప్రచారం మొదలైంది.

అందుకు కారణం తాజాగా బెన్ స్టోక్స్.. భారత్ లో ప్రత్యక్షమవ్వడమే. ముంబైలోని ముంబై ఇండియన్స్ టీమ్ హోటల్‌లో అతడు కనిపించడంతో ఈ రూమర్స్ ఊపందుకున్నాయి. అతడిని ముంబై టీమ్ అధికారులు రిసీవ్ చేసుకున్నారు. అందుకే అతడు ఐపీఎల్ 2025లో ముంబై జట్టుతో కలవనున్నాడని అంతా అనుకుంటున్నారు. వాస్తవానికి అతడు ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో పాల్గొనలేదు. అంతర్జాతీయ కెరీర్ పై పూర్తి దృష్టి పెట్టేందుకు అతడు ఐపీఎల్ కు దూరంగా ఉన్నాడు. పైగా అతడు గాయంతోనూ ఇబ్బంది పడుతున్నాడు. మరి ఇలాంటి సమయంలో అతడు ఇప్పుడెందుకు భారత్ వచ్చాడో అసలు కారణం తెలిసింది. అతడు కేఎల్ రాహుల్ తో కలిసి ఓ యాడ్ షూట్ చేసేందుకు ఇక్కడికి వచ్చాడట.

పైగా స్టోక్స్.. SA20 2025 టోర్నిలో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. అందుకే అతడు ముంబై ఫ్రాంఛైజీని కూడా ఇక్కడ కలిశాడు. కాగా, గతంలో స్టోక్స్.. ఐపీఎల్‌లో రైసింగ్ పూణె సూపర్‌జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 2017లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 2023లో గాయం కారణంగా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2024, 2025 సీజన్‌లలో ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు.

IPL 2025 Fact check Is Ben Stokes Joining Mumbai Indians
Story first published: Sunday, April 27, 2025, 16:23 [IST]
Other articles published on Apr 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+