Pakistani players in IPL history: ఐపీఎల్ 2025కు సమయం ఆసన్నమైంది. అయితే ఈ మెగాలీగ్ లో ప్రపంచ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల క్రికెటర్లందరూ ఆయా ఫ్రాంఛైజీల తరఫున ఆడుతుంటారన్న సంగతి తెలిసిందే. యువ ప్లేయర్ల నుంచి స్టార్ ఆటగాళ్ల వరకు అందరూ ఈ లీగ్ కోసం వేలంపాటలో పోటీ పడి మరీ, వచ్చి ఆడుతుంటారు. కానీ పాకిస్థాన్ క్రికెటర్లు మాత్రం ఇక్కడ కనపడరు. అందుకు కారణం వారిపై నిషేధం అన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉన్న సత్ససంబంధాలు సరిగ్గా లేని కారణంగా, అప్పట్లో జరిగిన 26/11 ఉగ్రదాడుల కారణంగా వారిని బ్యాన్ చేశారు. అయినప్పటికీ ఈ లీగ్ లో పలువురు పాకిస్థానీ క్రికెటర్లు ఆడారని మీకు తెలుసా? మొత్తం 11 మంది క్రికెటర్లు ఈ ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు వారెవరో తెలుసుకుందాం..
1. సోహైల్ తన్వీర్ (రాజస్థాన్ రాయల్స్)
ఐపీఎల్ 2008 సీజన్ లోని పాకిస్థాన్ ఆటగాళ్లలో ఈ ఎడమచేతి వాటం పేసర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున అతడు 11 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పర్పుల్ క్యాప్ (సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు అవార్డు) అందుకున్న ఏకైన పాకిస్థాన్ క్రికెట్ గా ఘతన సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై 6/14 బెస్ట్ బౌలింగ్ ఫిగర్ ను నమోదు చేశాడు.

3. షోయబ్ అక్తర్ (కోల్‌కతా నైట్ రైడర్స్)
రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్.. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ ఐదు వికెట్లు తీసి తన మార్క్ క్రియేట్ చేసి వెళ్లాడు. అందులో అతడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 4/11 బౌలింగ్ ఫిగర్ నమోదు చేయడం విశేషం.
4. షోయబ్ మాలిక్ (ఢిల్లీ డేర్ డెవిల్స్)
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఢిల్లీ డేర్ డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)కు ప్రాతినిధ్యం వహించాడు. అతడు ఏడు మ్యాచ్‌లు ఆడి 52 పరుగులు చేశాడు. అలానే బౌలింగ్ లో రెండు వికెట్లు పడగొట్టాడు.
5. మిస్బా-ఉల్-హక్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
మిస్బా-ఉల్-హుక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. అతడు ఎనిమిది మ్యాచ్‌ల్లో 117 పరుగులు చేశాడు. కానీ అంతగా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
6. మహ్మద్ ఆసిఫ్ (ఢిల్లీ డేర్ డెవిల్స్)
మంచి నైపుణ్యం కలిగిన స్వింగ్ బౌలర్ మొహమ్మద్ ఆసిఫ్.. ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. కానీ దురదృష్టవశాత్తు, అతడి కెరీర్ త్వరగానే వివాదాలతో ముగిసిపోయింది.
7. ఉమర్ గుల్ (కోల్‌కతా నైట్ రైడర్స్)
అప్పట్లో అత్యుత్తమ T20 బౌలర్లలో ఒకడు ఉమర్ గుల్. KKR తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఆరు మ్యాచులు ఆడి 12 వికెట్ తీసి క్రికెట్ అభిమానులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాడు.
8. కమ్రాన్ అక్మల్ (రాజస్థాన్ రాయల్స్)
వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. అతడు ఆరు మ్యాచ్‌ల్లో 128 పరుగులు సాధించాడు. మిడిల్ ఆర్డర్‌లో కొన్ని కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఆకట్టుకున్నాడు.
9. సల్మాన్ బట్ (కోల్‌కతా నైట్ రైడర్స్)
ఈ ఎడమచేతి వాటం ఓపెనర్ సల్మాన్ బట్ కూడా KKR తరపునే ఆడాడు. మొత్తంగా ఏడు మ్యాచ్‌ల్లో 193 పరుగులు సాధించాడు. కానీ నిలకడగా రాణించలేక బాగా ఇబ్బంది పడ్డాడు.
10. యూనిస్ ఖాన్ (రాజస్థాన్ రాయల్స్)
పాకిస్థాన్ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు యూనిస్ ఖాన్. ఇతడు రాజస్థాన్ రాయల్స్ తరపున ఒకే ఒక మ్యాచ్ ఆడి కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు.
11. మహ్మద్ హఫీజ్ (కోల్‌కతా నైట్ రైడర్స్)
పాకిస్థాన్ T20 కీలక ఆటగాడిగా మారడానికి ముందు, మహ్మద్ హఫీజ్ KKR తరపున ఎనిమిది మ్యాచులకు ప్రాతినిథ్యం వహించాడు. 64 పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టాడు.
2026లో ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్న పాక్ క్రికెటర్..
పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్.. ఐపీఎల్ 2026 ఆడాలనుకుంటున్నాడు. ఇప్పటికే అతడు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడి భార్య యూకే సిటిజన్. ఇప్పుడతడు కూడా యూకే పాస్ పోర్ట్ కోసం అప్లై చేసినట్లు తెలిసింది. వచ్చే ఏడాది తనకు అవకాశం దక్కితే ఐపీఎల్ ఆడతానని చెప్పాడు.