CSK క్యాంప్‌ను మధ్యలోనే వీడిన ధోనీ - ఫ్యాన్స్‌లో టెన్షన్! - అసలెందుకు వెళ్లాడంటే?
ఐపీఎల్ 2025కు మరో 10 రోజులే సమయం మిగిలి ఉంది. మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టీ20 లీగ్ కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సాహంలో ఉన్న టీమిండియా ప్లేయర్లు.. నెక్ట్స్ ఐపీఎల్ 2025 కోసం సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనాల్సిన అన్నీ జట్లు ట్రైనింగ్ క్యాంప్ లు నిర్వహించి ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. అయితే తాజాగా ధోనీ మాత్రం సడెన్ గా ట్రైనింగ్ క్యాంప్ ను మధ్యలో నుంచి వీడడం ఫ్యాన్స్ లో పలు అనుమానాలను లేవనెత్తింది. పైగా అతడి భార్యతో కలిసి వెళ్లిపోయాడు.
దీంతో ధోనీ ఎందుకు మధ్యలో నుంచి వెళ్లిపోయాడా అని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆరా తీస్తున్నారు. అతడికి ఏమైనా అయిందా లేదా ఇంకేమైనా జరిగిందా అని కాస్త టెన్షన్ పడుతున్నారు. మరి కొంతమంది అతడికి గాయమైందా అని అనుమానిస్తున్నారు. కానీ ఇదంతా ఊహాగానాలు మాత్రం. వాస్తవానికి మహీకి ఏం కాలేదు. ధోనీ తన భార్యతో కలిసి సీఎస్కే ట్రైనింగ్ క్యాంప్ వీడటానికి ఓ శుభవార్త కారణం.

తాజాగా పంత్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగాయి. అతడి సోదరి సాక్షి పంత్ పెళ్లి పీటలు ఎక్కనుంది. ఆమె.. వ్యాపారవేత్త అంకిత్ చౌదరిని పెళ్లి చేసుకోబోతోంది. ఈ వివాహ వేడుకలు తాజాగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకకే ధోనీ.. భార్యతో కలిసి హాజరయ్యాడు. అందుకే సీఎస్కే ట్రైనింగ్ క్యాంప్ మధ్యలో నుంచి బయటకు వచ్చాడు. మహీతో పాటు ఈ వేడుకకు హార్దిక్, సురేశ్ రైనా, సునీల్ గావస్కర్ సహా పలువురు క్రికెటర్లు హాజరై సందడి చేశారు. చిందులేస్తూ వేడుకను ఆస్వాదించారు.
కప్ ముద్దాడాలని...
ధోనీ.. తన కెప్టెన్సీలో సీఎస్కే జట్టుకు ఐదు సార్లు ట్రోఫీని తెచ్చిపెట్టాడు. గత సీజన్ లో కెప్టెన్సీకి రిజైన్ చేసి ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ సీజన్ లో అతడు అన్ క్యాప్డ్ ప్లేయర్ గా బరిలోకి దిగనున్నాడు. చెన్నై జట్టు అతడిని రూ.4 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్ లో సీఎస్కే ప్లే ఆఫ్స్ కు కూడా చేరకుండానే ఐదో స్థానంలో ముగించిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సారి ఎలాగైనా కప్ ముద్దాడాలని పట్టుదలతో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications