IPL 2025: కొత్త కెప్టెన్‌తో డేంజర్‌గా మారిన దిల్లీ క్యాపిటల్స్.. తుది జట్టు అంచనా ఇదే!
ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడని జట్లలో దిల్లీ క్యాపిటల్స్ ఒకటి. జట్టులో స్టార్ ప్లేయర్స్ ఉన్నా, మంచి నాణ్యమైన కోచింగ్ బృందం ఉన్నా.. దిల్లీకి అదృష్టం మాత్రం కలిసి రావట్లేదు. కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్ కు వెళ్లింది. కనీసం ఈ సారైనా కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ సారథ్యంలో బరిలోకి దిగి ట్రోఫీని ముద్డాడాలని ఆశిస్తోంది. మరి కొత్త సారథి అక్షర్ పటేల్ ఏమైనా దిల్లీ తలరాత మారుస్తాడేమో చూడాలి. ఈ నేపథ్యంలో దిల్లీ క్యాపిటల్స్ బలాబలాలపై ఓ లుక్కేద్దాం..
దిల్లీ జర్నీ సాగిందిలా..
ఐపీఎల్ తొలి రెండు సీజన్లలో దిల్లీ క్యాపిటల్స్ బానే రాణించింది. 2008, 2009లో సెమీస్ చేరింది. ఆ తర్వాతే చేతులెత్తేసింది. 2019 తర్వాత ఆట మార్చుకుంది. ఆ ఏడాది ప్లేఆఫ్స్ కు వెళ్లింది. 2020లో తొలిసారి ఫైనల్ చేరింది. 2021లోనూ గట్టిగానే పోరాడిన ఫలితం దక్కలేదు. మళ్లీ గత మూడేళ్లుగా లీగ్ దశ నుంచి ఇంటి ముఖం పడుతోంది.
దిల్లీ క్యాపిటల్స్ బలాలు..
- దిల్లీ క్యాపిటల్స్ జట్టు సీనియర్లు, జూనియర్లతో బ్యాలెన్స్డ్ గా ఉంది.
- డుప్లెసిస్, కేఎల్ రాహుల్ చేరికతో జట్టు బలంగా ఉంది. అక్షర్ పటేల్ కూడా పెద్ద బలం.
- ఆల్‌రౌండ్ నైపుణ్యం ఉన్న ప్లేయర్లు జట్టులో ఉన్నారు.
- యంగ్ బ్యాటర్స్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, స్టబ్స్ బ్యాటింగ్ డెప్త్ గా ఉంది.
- వరుస సెంచరీలో సూపర్ ఫామ్ లో ఉన్న కరుణ్ నాయర్ ఉన్నాడు.
- గాయం నుంచి కోలుకున్న మిచెల్ స్టార్క్ తో పాటు చమీర, ముకేశ్‌కుమార్, నటరాజన్, కుల్‌దీప్ యాదవ్‌తో బౌలింగ్ బలంగా ఉంది.
బలహీనతలు..
- దిల్లీకి ఓ స్థిరమైన నాయకుడు లేడు. ఇప్పుడు కొత్త కెప్టెన్ గా ఎంపికైన అక్షర్ పటేల్.. ఆటగాడిగా మంచి ఫామ్ లో ఉన్నాడు. మరి అతడు కెప్టెన్ గా బౌలర్ గా, బ్యాటర్ గా ఎలా రాణిస్తాడో..
- ఒక ఫినిషర్ కూడా జట్టు లేడు. జట్టుకు ఇది పెద్ద లోపం. కొత్తగా జట్టులోకి వచ్చిన సమీర్ రిజ్వి ఆ పాత్రను ఎలా పోషిస్తాడో.. లేదంటే గత సీజన్ లో పంజాబ్ తరఫున రాణించిన అశుతోష్ శర్మ ఈసారి దిల్లీ జట్టులో ఎలా ఆడతాడో...
- రూ.6.25 కోట్లతో కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ స్టార్ హ్యారీ బ్రూక్.. ఈ సీజన్ నుంచి తప్పుకోవడం పెద్ద దెబ్బే.
టీమ్ కాంబినేషన్
ప్రారంభ మ్యాచులకు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండడని సమాచారం. తొలి మ్యాచ్ లో దిల్లీ.. మార్చి 24న లఖ్ నవూతో తలపడనుంది. హ్యారీ బ్రూక్, రాహుల్ లేకపోవడంతో ఫాప్ డుప్లెసిస్ ఓపెనింగ్ బాధ్యతలు చూసుకుంటాడు. జేక్ ఫ్రేజర్ తో కలిసి అతడు ఓపెనింగ్ చేస్తాడు. లేదంటే కేఎల్ రాహుల్ - జేక్ ఫ్రేజర్ ఓపెనింగ్ చేసేవారు. ఫాప్ డుప్లెసిస్ మూడో స్థానంలో వచ్చేవాడు. మిడిలార్డర్ లో అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ ఉంటారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలను పంచుకుంటారు. మిచెల్ స్టార్క్ పేస్ ను లీడ్ చేస్తాడు. ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ కూడా పేస్ ను చూసుకుంటారు.
దిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు అంచనా ఇదే
జేక్ ఫ్రేజర్, కేఎల్ రాహుల్, ఫాప్ డుప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), అక్సర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ, టి నటరాజన్.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications