For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC Playing XI: తొలి స్థానం కోసం పోరు.. గుజరాత్‌తో తలపడే ఢిల్లీ తుదిజట్టు ఇదే!

GT vs DC: ఐపీఎల్ 2025లో భాగంగా ఏప్రిల్ 19న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఈ సీజన్ లో అద్బుతంగా రాణిస్తున్నాయి. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌‌ల్లో 5 మ్యాచ్ లు గెలిచి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ 8 పాయింట్లచో రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ కంటే మెరుగైన రన్ రేట్ తో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానానికి చేరుకోగలదు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. దానిని నిలబెట్టుకునేందుకు పోరాడనుంది. గుజరాత్ జట్టు కూడా ఈ మ్యాచ్ గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నించనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ కోసం ఒక మార్పు చేసే అవకాశం ఉంది.

వీరిద్దరు ఓపెనింగ్ ప్లేయర్లుగా రావచ్చు..
ఢిల్లీ ఓపెనింగ్ బ్యాటర్లలో కీలక మార్పు జరిగే అవకాశం ఉంటుంది. జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ను ఈ మ్యాచ్ లో పక్కన పెట్టే అవకాశం ఉంది. ఈ బ్యాటర్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో తన సత్తాను చూపించలేకపోయాడు. జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ స్థానంలో ఫాఫ్ డుప్లెసిస్ బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉంది. గత మ్యాచ్‌లో 37 బంతుల్లో 49 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ పోరెల్ .. ఫాఫ్ డుప్లిసిస్ తో కలిసి ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉంది.

IPL 2025 Delhi Capitals Predicted Playing XI vs Gujarat Titans Battle for Top Spot

ఇది మిడిల్ ఆర్డర్..
కరుణ్ నాయర్ మూడో స్థానంలో బ్యాటింగ్ రావచ్చు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో కరుణ్ నాయర్ అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. కరుణ్ నాయర్ తన తొలి మ్యాచ్ లో 89 పరుగులు చేశాడు. అయితే చివరి మ్యాచ్ లో కరుణ్ నాయర్ రనౌట్ అయ్యాడు. ఆ మ్యాచ్ పరుగులు చేయకుండానే సున్న పరుగులకే ఔటయ్యాడు. అయితే గొప్ప ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లోయర్ మిడిల్ ఆర్డర్ లో అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ బ్యాటింగ్ దిగనున్నారు.

బౌలింగ్ విభాగం ఇలా..
విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ స్పిన్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించగలరు. మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మలను ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో చూడవచ్చు.

గుజరాత్ తో తలపడే ఢిల్లీ ప్లేయింగ్ XI ఇదే..
ఫాఫ్ డుప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ.

Story first published: Friday, April 18, 2025, 18:20 [IST]
Other articles published on Apr 18, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+