Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఢిల్లీ బౌలింగ్ కోచ్‌కు భారీ జరిమానా.. ఎందుకంటే?

IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఇక్కడ ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో బీసీసీఐ అతడిపై చర్య తీసుకుంది. అంపైర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగినందుకు మునాఫ్ కు భారీ జరిమానా విధించబడింది. మునాఫ్ పటేల్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించబడింది. దీనితో పాటు మునాఫ్ పటేల్ కు ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇవ్వబడింది.

నిజానికి ఈ మ్యాచ్‌కు సంబంధించి మునాఫ్ పటేల్ వీడియో వైరల్ అవుతోంది. అందులో మునాఫ్ పటేల్ బౌండరీ దగ్గర ఫోర్త్ అంపైర్ తో వాదిస్తున్నట్లు కనిపిస్తుంది. మునాఫ్ పటేల్‌ను చూస్తుంటే అంపైర్ చెప్పిన దానికి కోపంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మునాఫ్ పటేల్ తన జట్టు ఆటగాళ్లలో ఒకరి ద్వారా మైదానంలో సందేశం ఇవ్వాలనుకున్నాడని తెలుస్తోంది. కానీ అంపైర్ అతడికి అలా చేయడానికి అనుమతి ఇవ్వలేదు. దీని తర్వాతే మునాఫ్ పటేల్ అంపైర్ తో గొడవ పడ్డాడు.

IPL 2025 Delhi Bowling Coach Munaf Patel Fined Heavily for Misconduct

తన తప్పును అంగీకరించిన మునాఫ్ పటేల్
ఆర్టికల్ 2.20 కింద లెవెల్ 1 నేరానికి మునాఫ్ పటేల్ నేరాన్ని అంగీకరించాడు. తద్వారా విచారణ అవసరం లేకుండా పోయింది. మునాఫ్ పటేల్ గురించి బీసీసీఐ తన ప్రకటనలో "మునాఫ్ పటేల్ లెవెల్ 1 నేరాన్ని అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ ఇచ్చిన నిర్ణయాన్ని కూడా అంగీకరించాడు' అని పేర్కొంది.

Story first published: Thursday, April 17, 2025, 14:36 [IST]
Other articles published on Apr 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+