Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: సన్‌రైజర్స్‌కు సెలవు- డేల్ స్టెయిన్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బౌలింగ్ కోచ్‌గా తన అనుబంధం ముగిసిందని దక్షిణాఫ్రికా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నాడు. వచ్చే సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు బౌలింగ్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించట్లేదని తెలిపాడు. అయితే సన్‌రైజర్స్ అనుబంధ ఫ్రాంచైజీ 'సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌'తో కోచింగ్ హోదాలో కొనసాగుతానని వెల్లడించాడు.

ఐపీఎల్-2024 సీజన్‌‌లోనూ ఎస్‌ఆర్‌హెచ్‌కు డేల్ స్టెయిన్ అందుబాటులో ఉండని విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో గత సీజన్‌కు దూరంగా ఉన్నాడు. తాజాగా బౌలింగ్ కోచ్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పాడు. ''సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ధన్యవాదాలు. గత కొన్నేళ్లుగా బౌలింగ్ కోచ్‌గా ఉన్నాను. అయితే దురదృష్టవశాత్తు ఐపీఎల్ 2025కు కలిసి పనిచేయలేకపోతున్నా. కానీ సౌతాఫ్రికా టీ20లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్‌తో కలిసి కొనసాగుతాను'' అని డేల్ స్టెయిన్ పేర్కొన్నాడు.

IPL 2025 Dale Steyn Steps Down as Sunrisers Hyderabad Bowling Coach

41 ఏళ్ల డేల్ స్టెయిన్ ప్లేయర్‌గా డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో 95 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 97 వికెట్లు తీశాడు. చివరిగా ఆర్సీబీ తరఫున 2020 సీజన్‌లో ఆడాడు. అనంతరం ఐపీఎల్- 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్ మెరుగవ్వడంతో స్టెయిన్ కీలక పాత్ర పోషించాడు.

అయితే గత సీజన్‌లో అతను అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్ క్రికెటర్ జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎస్‌ఆర్‌హెచ్ నియమించింది. కోచ్ డేనియల్ వెటోరీ, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కాంబినేషన్‌‌లో ఎస్‌ఆర్‌హెచ్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్స్‌కు చేరిన సన్‌రైజర్స్ కేకేఆర్ చేతిలో ఓటమిపాలై కప్‌ను చేజార్చుకుంది.

Story first published: Thursday, October 17, 2024, 12:14 [IST]
Other articles published on Oct 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+