Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK VS RCB Kohli: సీఎస్కే స్పిన్ అటాక్ - కోహ్లీ వ్యూహం ఇదే!!

IPL 2025 CSK VS RCB: స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ ఈ మధ్య కాలంలో స్పిన్నర్లకు తరచుగా వికెట్లు సమర్పించుకోవడం ఫ్యాన్స్‌ను ఆందోళన కలిగించింది. అసలు వన్డేల్లో అయితే గత 8 ఇన్నింగ్స్ లో ఏకంగా 7 సార్లు స్పిన్నర్ల చేతిలో వికెట్లు పోగొట్టుకున్నాడు. దీంతో ఈ బలహీనతను అధిగమించేందుకు కింగ్‌.. తన టెక్నిక్‌ను మెరుగుపర్చుకోవడంతో పాటు.. తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నాడు. అందుకు తగ్గట్టే ఈ మధ్య జరిగిన కొన్ని మ్యాచుల్లో అతడి బ్యాటింగ్‌ శైలిలో మార్పు కనిపిస్తోంది. ఆడే షాట్లలో మరింత పరిణతి కనిపిస్తోంది.

అయితే ఇప్పుడు ఐపీఎల్ 2025లో భాగంగా సీఎస్కే - ఆర్సీబీ తలపడనున్నాయి. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఆడుతున్నాయి. దీంతో ఈ హై వోల్టేజ్ మ్యాచు కోసం ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ఆర్సీబీ బ్యాటింగ్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అయితే సీఎస్కే స్పిన్ అటాక్ ను ఎదుర్కొనేందుకు బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ లాంటి వాళ్లను ఫేస్ చేసేందుకు నెట్స్ లో గట్టిగానే ప్రత్యేక సాధన చేస్తున్నాడు.

IPL 2025 CSK VS RCB Virat Kohli special practice in nets to face CSK s spin attack

రీసెంట్ గా ఐపీఎల్ 2025 ఓపెనింగ్ మ్యాచులో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచులో కోహ్లీ 36 బంతుల్లో 59 నాటౌట్ పరుగులు చేశాడు. అప్పుడు స్పిన్నర్లపై అతడు కాస్త పర్వాలేదనిపించేలా ఆడాడు. ఇక ఇప్పుడు సీఎస్కేతో జరిగే మ్యాచులో విరాట్.. స్పిన్నర్లను ఎలా అధిగమిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Story first published: Thursday, March 27, 2025, 15:28 [IST]
Other articles published on Mar 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+