Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK VS RCB: 17 ఏళ్లుగా ఒక్క సారి కూడా..

CSK VS RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ అండ్ టఫ్ ఫైట్ జరగనుంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ రెండూ మేటీ జట్లు కావడంతో ఏ టీమ్ గెలుస్తుందో క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఎన్ని సార్లు తలపడ్డాయి.. ఎవరిది పైచేయి?
ఇప్పటికే ఈ సీజన్‌ను సీఎస్కే, ఆర్సీబీ విజయాలతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని ఈ రెండు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. అయితే చెన్నై వర్సెస్ ఆర్సీబీ ఇప్పటివరకు 33 సార్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై జట్టే ఎక్కువ సార్లు పైచేయి సాధించింది. ఏకంగా 21 మ్యాచుల్లో ఆర్సిబీని ఓడించింది. ఇక చెన్నైపై కేవలం 11 మ్యాచుల్లోనే విజయం సాధించింది ఆర్సీబీ. ఒకే ఒక్క మ్యాచ్ ఫలితం తేలలేదు.

వరుసగా 17ఏళ్లుగా ఒక్కసారి కూడా..
ఐపీఎల్‌ 2025.. ఇప్పటివరకు 17 సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 18వ సీజన్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య చెన్నై చెపాక్ వేదికగా జరగనుంది. అయితే చెన్నై గడ్డపై 17 ఏళ్ల నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు.

ఆర్సీబీ చివరిసారిగా 2008 ఐపీఎల్‌ ప్రారంభ ఎడిషన్‌లో చెపాక్ గడ్డపై చెన్నైపై గెలిచింది. ఆ తర్వాత మళ్లీ గెలవనేలేదు. అందుకే ఈ సీజన్ లోనైనా చెపాక్ గడ్డపై ఆర్సీబీ గెలుస్తుందా అన్నది ఇక్కడ ఆసక్తికరం. అందుకే అభిమానులు మరింత ఉత్కంఠతో సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచు కోసం ఎదురుచూస్తున్నారు.

IPL 2025 CSK VS RCB Head to Head records From 17 years Royal challengers bangalore no win on chepak stadium

జట్టులో కీలకం వీళ్లే..
ఈ ఐపీఎల్ గత మ్యాచుల్లో సీఎస్కే తరఫున నూర్ అహ్మద్.. ఆర్సీబీ తరఫున కృనాల్‌ పాండ్య అద్భుతంగా రాణించారు. ఇక జట్టు మొత్తంగా కోహ్లీ, ఫిల్‌ సాల్ట్, కెప్టెన్‌ రజత్‌ పాటిదార్, లివింగ్‌స్టన్, జితేశ్‌శర్మతో బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. చెపాక్‌ పిచ్‌ స్పిన్‌ కాబట్టి.. జాకబ్‌ బెతెల్‌ లేదా టిమ్‌ డేవిడ్‌లలో ఒకరు తుది జట్టులోకి రావొచ్చు. స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తుది జట్టులో ఆడతాడా లేదా అన్నది చూడాలి. చెన్నైలో కెప్టెన్‌ రుతురాజ్, రచిన్‌ రవీంద్ర ఫామ్ చూపించాలి. ధోనీ మెరుపులు మెరిపించాలి. ఇక ముందు మ్యాచులో విఫలమైన సామ్‌ కరన్, శివమ్‌ దూబె, దీపక్‌ హుడా కూడా రాణించాలి. ఫిట్‌నెస్‌ లేక పేసర్‌ పతిరన ఆడతాడో లేదో చెప్పలేం.

Story first published: Friday, March 28, 2025, 8:51 [IST]
Other articles published on Mar 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+