Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025 CSK Vs MI: వామ్మో.. ఒక్కో టికెట్ ధర ఎన్ని లక్షలంటే?

ఐపీఎల్ 2025 సమయం దగ్గర పడుతుండడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠత పెరుగుతోంది. ఎప్పుడెప్పుడు ఈ మెగా లీగ్ ప్రారంభం అవుతుందా అని వెయ్యి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలానే మ్యాచ్ టికెట్ల కోసం కాపు కాసి మరీ ఎదురుచూస్తున్నారు. దీంతో బ్లాక్ టికెట్స్ దందా కూడా మొదలైపోయింది. ఒక్కో టికెట్ ధర లక్షల్లో పలుకుతోంది. అభిమానులు కూడా అంత ధర పెట్టి కొనుగోలు చేసేందుకు వెనకాడటం లేదు.

ఆ జట్టు మ్యాచులకు ఫుల్ డిమాండ్..
ఐపీఎల్‌లో ముంబయి, సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్‌లకు ఎంతటి డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ్యాచ్ కోసం ఎంతైనా చెల్లించి స్టేడియానికి తరలి వెళ్తుంటారు అభిమానులు. ఇదే అదనుగా చేసుకుని ఈ సారి ఐపీఎల్ లో బ్లాక్ మార్కెట్ మరింత చెలరేగిపోతోంది. మొత్తంగా 12 కేటగిరీలుగా విభజించి టికెట్లను విక్రయిస్తున్నారు. లోయర్ స్టాండ్ టికెట్లను ఒరిజినల్ ధర కన్నా పది రెట్లు ఎక్కువతో అమ్ముతున్నారు.

IPL 2025 CSK vs MI match Black Tickets price Nearly Upto 5 Lakhs
Photo Credit: ,

ముంబయి - సీఎస్కే మ్యాచ్ టికెట్ ధర ఎంతంటే?
ఓ పాపులర్ రీసేల్ ప్లాట్ ఫామ్ వయాగోగోలో సీఎస్కేకు సంబంధించిన అన్ని మ్యాచులతో పాటు ఇతర జట్ల మ్యాచుల టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.17,804 నుంచి రూ.1.24 లక్షల మధ్య రేంజ్ లో టికెట్ ధరలు ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా అంత పెట్టి కొనుగోలు చేసేస్తున్నారు. మార్చి 23న జరిగే సీఎస్కే, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ కు డిమాండ్ బాగా ఉందట. ఈ మ్యాచ్ కు సంబంధించి అధికారికంగా టికెట్ల సేల్ ఇంకా అధికారికంగా ప్రారంభం కాకుండానే.. బ్లాక్ సేల్స్ లో భారీగా జరుగుతున్నాయి. ఒక్కో టికెట్ ధర అత్యధికంగా రూ.57 వేలకు పైగా ఉందని తెలిసింది. అలానే ఏప్రిల్ 20న జరిగే సీఎస్కే - ముంబయి మ్యాచ్ అత్యధిక టికెట్ ధర అయితే ఏకంగా రూ.5.13 లక్షలుగా ఉంది. మరోవైపు ఇంకొంతమంది ఈ కొండంత ధరలు చూసి షాకైపోతూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Story first published: Thursday, March 13, 2025, 10:49 [IST]
Other articles published on Mar 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+