Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: సీఎస్కేలో ఈ నలుగురు సుద్ధ దండగ!!

IPL 2025 CSK: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ కథ కంచికి చేరుతోంది. ఇంకా సీజన్ సగం కూడా ముగియలేదు, అప్పుడే సీఎస్కే క్లైమాక్స్ కు చేరుకుంటోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో ఏకంగా ఐదింటిలో ఓడింది. ఇంకా సీఎస్కే కు ఎనిమిది మ్యాచులే మిగిలి ఉన్నాయి. కాబట్టి చెన్నై జట్టు రేసులో ఉండాలంటే కనీసం 7 మ్యాచులు గెలవాల్సిన అవసరం ఉంది.

ఇప్పుడున్న ఫామ్ ఆధారంగా సీఎస్కేకు ఇది అసాధ్యం అయినప్పటికీ.. రేసులో నిలవాలంటే గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. అయితే సీఎస్కే జట్టులో ప్రస్తుతం ఎన్నో సమస్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోచ్ ఫ్లెమింగ్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రూపంలో ఇది కనిపిస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు.

ipl-2025-csk-poor-performance-continues-fans-blaming-these-4-players-should-kick-out

కోచ్ పై విమర్శలు..
తన సొంత జట్టు ఆటగాళ్లనే ఓ కోచ్ కొనుగోలు చేస్తున్నాడని తన యూట్యూబ్ ఛానల్ లోనూ రవిచంద్రన్ అశ్విన్ గతంలో ఫ్లెమింగ్ పై పరోక్షంగా విమర్శలు చేశాడు. ఇప్పుడా విషయాన్ని ఫ్యాన్స్ మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. వాళ్లు సరైన ప్రదర్శన చేయనప్పటికీ.. జట్టులోకి తీసుకోవడం వల్ల సీఎస్కే జట్టు ఓటమి చెందుతోందని ఇప్పుడు క్రికెట్ అభిమానుల వాదన.

ముఖ్యంగా అప్పటివరకు ఫామ్ లో కనిపించిన రచిన్ రవీంద్ర.. ఐపీఎల్ మ్యాచుల్లో తేలిపోయాడు. అతడు కేవలం రెండు మ్యాచుల్లోనే మంచి ప్రదర్శన చేశాడు. అతడు ఆల్ రౌండర్ అయినప్పటికీ సింగిల్ బాల్ కూడా వేయలేదు. ఇలాంటి సమయంలో సీఎస్కే.. అతడిని పక్కన పెట్టకుండా కొనసాగించింది. దీనికి కారణం కోచ్ ఫ్లెమింగ్ అని ఫ్యాన్స్ అంటున్నారు.

రాహుల్ త్రిపాఠిని కూడా జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అతడు ఫామ్ లో లేని కారణంగా భారత జట్టు నుంచి తప్పించారు. దేశవాళీ క్రికెట్ లోనూ అతడు పెద్దగా పరుగులు చేయలేదు. ఇలాంటప్పుడు అతడిని.. సీఎస్కే వేలంలో కొనుగోలు చేశారు. ఈ సీజన్ లో అతడి బ్యాటింగ్ లో ఆత్మవిశ్వాసం కూడా కనిపించలేదు. మరి ఎందుకు ఆడిస్తారని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక మూడోది దీపక్ హూడా. అతడు మంచి ఆల్ రౌండర్ అయినప్పటికీ.. పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. రాబిన్ ఉతప్ప, రహానె తరహాలో ఆడుతాడనుకుంటే చేతులెత్తేస్తున్నాడు. అయినప్పటికీ సీఎస్కే అతడిని కొనసాగిస్తోంది. తాజాగా కేకేఆర్ తో జరిగిన మ్యాచులోనూ ఇంపాక్ ప్లేయర్ గా బరిలోకి దింపింది. కానీ అతడు నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు.


మార్పులు అవసరం..
ఇక కోచ్ ఫ్లెమింగ్ కూడా ఎన్నో ఏళ్లుగా కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు అతడి నిర్ణయాలు పాతబడిపోయాయని, జట్టుకు మార్పులు అవసరమని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సీజన్ లో సీఎస్కే జట్టు ముందుకు వెళ్లాలంటే భారీ మార్పులు చేయాల్సిందేనని చెబుతున్నారు. "కెప్టెన్ రుతురాజ్ ను మార్చాలి. ఇక సీనియర్స్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సీఎస్కే జట్టు షేక్ రషీద్, బేడీ సహా ఇతర యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలి. ప్లేయింగ్ 11లో యంగ్ ప్లేయర్స్ కు చోటు ఇవ్వాలి. వారి చేత ఆడించి, వారిలో ఆత్మవిశ్వాసం నింపాలి. అప్పుడే సీఎస్కే గెలవడానికి అవకాశాలు ఉన్నాయి,లేదంటే జట్టు తుస్సు మనడం ఖాయం." అని చెబుతున్నారు.
Story first published: Saturday, April 12, 2025, 7:46 [IST]
Other articles published on Apr 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+