Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: సీఎస్కే స్టార్ ప్లేయర్ తండ్రి మృతి

IPL 2025 CSK: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ చెత్త ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆడిన 8 మ్యాచుల్లో ఆరు మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనతో సీఎస్కే దాదాపుగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా తప్పుకుంది. అయితే ఇప్పుడు సీఎస్కేకు చెందిన ఓ స్టార్ ప్లేయర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

Devon convey father died: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ డెవాన్ కాన్వే తండ్రి డెంటాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తాజాగా ట్వీట్ ద్వారా తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో అతడి కుటుంబానికి మద్దతుగా ఉంటామని పేర్కొంది. అతడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.

కాగా, ఏప్రిల్ 11 నుంచి సీఎస్కే తరఫున ఏ మ్యాచులోనూ ఆడలేదు కాన్వే. ఈ క్రమంలోనే ఇప్పుడు కాన్వే తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసి విషయాన్ని తెలిపింది సీఎస్కే. కాన్వే తండ్రి మృతికి సంతాపంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో సీఎస్కే ఆటగాళ్లు నల్ల బ్యాండ్ ధరించి కూడా ఆడారు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన కాన్వే.. వాస్తవానికి సౌత్ ఆఫ్రికాకు చెందిన వ్యక్తి. కానీ క్రికెట్ లో మరింత మెరుగైన అవకాశాల కోసం అతడి కుటుంబం న్యూజిలాండ్ కు మకాం మార్చింది.

IPl 2025 CSK player Devon Convey father died Chennai super kings post heartfelt message
Story first published: Monday, April 21, 2025, 22:27 [IST]
Other articles published on Apr 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+