IPL 2008 - 2025: ఫస్ట్ 5 మ్యాచెస్ రిజల్ట్స్ - సీఎస్కేకు చెత్త సీజన్ అదే!!
IPL 2025 CSK: ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను నిరాశ పరుస్తూనే ఉంది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులోనూ ఓడి.. ఈ సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఆడిన ఐదు మ్యాచులో నాలుగింటిలో ఓడి, కేవలం 2 పాయింట్లతో పాయింట్స్ పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఈ ప్రదర్శనతో సీఎస్కేకు ఏమైందంటూ అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. అసలు సీఎస్కే ప్లేఆఫ్స్ రేసుకు వెళ్తుందా అని తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో 2008 నుంచి ఇప్పటివరకు అన్నీ సీజన్లలో తొలి ఐదు మ్యాచులో సీఎస్కే ప్రదర్శన ఎలా ఉంది?, ఎన్ని మ్యాచులు గెలిచింది?, ఎన్ని ఓడింది? తెలుసుకుందాం..
2008 ప్రారంభ ఎడిషన్ లో సీఎస్కే తన తొలి ఐదు మ్యాచుల్లో వరుసగా నాలుగు గెలిచింది. కానీ ఐదో మ్యాచులో ఓడింది.
2009లో మొదటి ఐదు మ్యాచుల్లో మూడింటిలో ఓడింది. ఒక్క దాంట్లో మాత్రమే గెలిచింది. మరొకటి వర్షం వల్ల ఫలితం తేలలేదు. అప్పుడు కేవలం మూడు పాయింట్లు మాత్రమే సాధించింది.
2010లో సీఎస్కే టైటిల్ గెలుచుకుంది. ఆ సీజన్ లో తొలి ఐదు మ్యాచుల్లో రెండు గెలవగా, మూడింటిలో ఓడింది.
2011లోనూ చెన్నై జట్టు టైటిల్ విజయం సాధించింది. అప్పుడు కూడా మొదటి ఐదు మ్యాచుల్లో రెండు గెలిచింది, మూడింటిలో ఓడింది.

2012లో కూడా మొదటి ఐదు మ్యాచుల్లో రెండు విజయాలు, మూడు ఓటములను నమోదు చేసింది.
2013లో మూడు గెలిచి, రెండింటిలో ఓడింది.
2014లో ఏకంగా నాలుగు గెలిచి, ఒక్క మ్యాచులోనే పరాజయాన్ని అందుకుంది.
2015లోనూ మళ్లీ నాలుగింటిలో విజయం సాధించిది, ఒక్క మ్యాచులోనే ఓడింది.
రెండేళ్ల పాటు నిషేధానికి గురై తిరిగొచ్చిన సీఎస్కే.. 2018లో టైటిల్ ముద్దాడింది. అప్పుడు మొదటి ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచి, ఒక్క దాంట్లో నిరాశపరిచింది.
2019లో నాలుగు గెలిచి, ఒక్క ఆటలో ఓడింది.
2020 సీఎస్కేకు చెత్త సీజన్. అప్పుడు మొదటి ఐదు మ్యాచుల్లో రెండు గెలిచి, మూడింటిలో ఓడింది.
2021లో సీఎస్కే నాలుగు విజయాలు సాధించి, ఒక్క దాంట్లో మాత్రం ఓడిపోయింది. ఈ సీజన్ లో ట్రోఫీని ముద్దాడింది.
2022 సీఎస్కేకు బ్యాడ్ సీజన్. కానీ అప్పుడు కూడా మొదట నాలుగింటిలో జోష్ చూపింది, ఒకటి మాత్రం నిరాశపరిచింది.
2023లో టైటిల్ గెలుచుకున్న చెన్నై జ్టటు.. మూడు గెలిచి, రెండింటిలో ఓడింది.
2024లో తొలి ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు,రెండు ఓటములను అందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications