టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ స్థాయిలో మహీకి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులే కాకుండా, ఇతర జట్లలోని ప్లేయర్స్ కూడా అతడిని ఆరాధిస్తారు. మహీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి నాలుగేళ్లు దాటేసిన, ఇంకా అతడి క్రేజ్ ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. అతడు ఎక్కడికి వెళ్లినా, కనిపించినా.. ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తూ ఎగబడతారు. ఇంకా చెప్పాలంటే అతడి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. మరి లేడీ ఫ్యాన్స్ ను మహీ ఎలా డీల్ చేస్తాడో తెలుసా? వారంతా తన చుట్టూ ఉంటే ఎలా ప్రవర్తిస్తాడో తెలుసా? ఈ ప్రశ్నలకు తాజాగా మహీనే స్వయంగా చెప్పాడు.
ఓ ప్రమోషనల్ ఈవెంట్ కు హాజరైన ధోనీని.. "మీ చుట్టూ మహిళా ఫ్యాన్స్ ఉంటే మీరేం చేస్తారు? అప్పుడు మీ భార్య మీ పక్కనే ఉండాలని మీరు అనుకుంటారా?" అని అడిగారు. దానికి మహీ సమాధానమిస్తూ.. "ఆమె ఎప్పుడూ నా పక్కనే ఉంటుంది. ఒకవేళ తను నా పక్కనే లేకపోయినా.. ఆమె నా పక్కనే ఉన్నట్లు భావిస్తాను. అదే మంచిది కూడా. నేను సేఫ్ గా ఉండాలంటే అలా భావించడమే కరెక్ట్". అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

కాగా, మహీ తన భార్య సాక్షిని 2010, జులై 4న డెహ్రాదూన్ లో వివాహం చేసుకున్నాడు. చిన్నప్పుడు వీరిద్దిరు స్కూల్ మేట్స్. ఆ తర్వాత ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు. అనంతరం 2007లో ఈడెన్ గార్డెన్స్ లో పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ కోసం కోల్ కతాలోని తాజ్ బెంగాల్ హోటల్ కు వెళ్లాడు మహీ. అక్కడే సాక్షిని కలిసి ప్రేమలో పడ్డాడు ధోనీ. ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ధోనీ ఐపీఎల్ లో ఆడుతున్నాడు. 2025 సీజన్ కోసం సీఎస్కే అతడిని రూ.4కోట్లకు రిటైన్ చేసుకుంది.