IPL 2025: అత్యంత భయంకరంగా సీఎస్కే జట్టు - తుది జట్టు అంచనా ఇదే!
ఐదుసార్లు ఛాంపియన్, మూడు సార్లు తప్ప ప్రతీసారీ ఫేఆప్స్, జట్టులో ధోని లాంటి మేటి ప్లేయర్.. ఇది చాలు చెప్పడానికి ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలాంటిదో. ఐపీఎల్‌లో అత్యంత నిలకడైన జట్టుగా రాణిస్తోన్నసీఎస్కే. ఏకంగా పది సార్లు ఫైనల్ చేరి ఐదు టైటిళ్లు సాధించింది. ఇప్పుడు మరోసారి ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
కానీ గతేడాది పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. కనీసం ప్లే ఆఫ్స్ కు కూడా చేరకుండా ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఈ సారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. అనుకున్నట్టే ఈసారి విజేతగా నిలిస్తే చెన్నై జట్టు.. ముంబయి ఇండియన్స్‌ను అధిగమించి ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంఛైజీగా నిలుస్తుంది.
చెన్నై బలాలు..
- ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రవీంద్ర జడేజాలతో బలమైన కోర్ టీమ్.
- అశ్విన్, జడేజా, అప్ఘాన్ స్పిన్ సెన్సేషన్ నూర్ అహ్మద్ తో పటిష్టంగా స్పిన్ విభాగం
- టాప్ ఆర్డర్ లో కాన్వే, గైక్వాడ్ స్ట్రాంగ్ పార్ట్నర్ షిప్. పవర్ ప్లేలో వీరిద్దరు నిలకడగా రాణిస్తూ మంచి ప్రభావం చూపించగలరు.
- మూడు నాలుగు స్థానాల్లో న్యూజిలాండ్ సెన్సేషన్ రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి బలంగా రాణించగలరు.
- దుబె,జడేజా, సామ్ కరణ్, విజయ్ శంకర్, అశ్విన్ బలమైన ఆల్ రౌండర్లు.
- డెత్ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్, మతీశా పతిరణ, ఖలీల్ అహ్మద్
చెన్నై బలహీనతలు..
- బెస్ట్ ఫినిషర్ కనపడట్లేదు. జడేజా అంత గొప్ప ఫినిషర్ కాదు. ధోనీ బెస్ట్ ఫినిషర్ అయినప్పటికీ జట్టు అవసరాన్ని బట్టి క్రీజులోకి వస్తాడు. 43 ఏళ్ల వయసులో అతడిపై పూర్తిగా ఆధారపడటం కరెక్ట్ కాదు.
- బ్యాకప్ ఆటగాళ్లు దీపక్ హుడా, విజయ్ శంకర్ కూడా అంత ఫామ్ లో లేరు.
టీమ్ కాంబినేషన్
గైక్వాడ్, కాన్వే ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. మిడిలార్డర్ లో రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి,జడేజా .. ధోనీ వికెట్ కీపర్ గా లేదా ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగుతాడు. స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్లుగా రచిన్, జడేజా ఆడనుండగా.. వీరిద్దరికి తోడుగా స్పిన్ ను అప్ఘాన్ నూర్ అహ్మద్ పంచుకుంటాడు. ఖలీల్ అహ్మద్, మతీషా పlతిరణ పేస్ విభాగాన్ని పంచుకుంటారు.
ఫైనల్ గా పేపర్ పై సీఎస్కే బ్యాటింగ్ బౌలింగ్ యూనిట్ బలంగా కనిపిస్తోంది. మంచి సాలిడ్ గా, బ్యాలెన్స్డ్ గా ఉంది. తన తొలి మ్యాచ్ ను మార్చి 23న ముంబయి ఇండియన్స్ తో తలపడనుంది. చూడాలి మరి బరిలోకి దిగినప్పుడు ఈ జట్టుతో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో.
తుది జట్టు అంచనా
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోనీ, రవిచందరన్ అశ్విన్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications