Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: CSK ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ - ధోనీ గురించి కీలక అప్డేట్ వచ్చిందోచ్

ఐపీఎల్ లో ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి విషయంలోనే అభిమానుల్లో ఎప్పుడూ తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొంటుంది. అసలు అతడు ఐపీఎల్‌లో ఆడతాడా? లేదా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అయితే ఈ సీజన్ లో తాను ఆడబోతున్నట్లు ఇప్పటికే ధోనీ కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. సీఎస్కే అతడిని అన్ క్యాప్డ్ ప్లేయర్ గా రిటెన్షన్ చేసుకుంది.

అయితే ఐపీఎల్ 2025 దగ్గరపడుతోన్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ధోనీ ఐపీఎల్ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం అతడు ప్రాక్టీస్ చేస్తోన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫొటోలో మహీ నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీంతో 'మహీ ఐపీఎల్ కోసం సిద్ధమయ్యాడం'టూ పోస్ట్ లు కనిపిస్తున్నాయి. ఇక ఈ పోస్ట్ చూసిన సీఎస్కే ఫ్యాన్స్ ఆ పిక్ ను తెగ షేర్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

IPL 2025 CSK Captain MS Dhoni starts preparation batting practice in nets for IPL photo goes viral

కాగా, రీసెంట్ గానే తన ఐపీఎల్ కెరీర్ గురించి ధోనీ మాట్లాడుతూ.. "మరికొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడేందుకు తాను సిద్ధమవుతున్నట్లు చెప్పాడు. రాబోయే కొన్నేళ్ల పాటు ఆటను ఆస్వాదిస్తాను. ఇందుకోసం గత తొమ్మిది నెలలుగా ఫిట్‌నెస్‌పై దృష్ టిసారించాను" అని వెల్లడించాడు.

ఇకపోతే ఐపీఎల్ 2025 కోసం ఇతర ఫ్రాంఛైజీలు కూడా సన్నాహాలు మొదలు పెట్టాయి. లఖ్ నవూ సూపర్ జెయింట్స్ తమ కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసే పనిలో పడింది. మిగతా ఫ్రాంఛైజీలు క్యాంపులు నిర్వహిస్తున్నాయి. మార్చి 23 నుంచి తాజాగా ప్రారంభం కానుందని ఇటీవలే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. మే 25న ఫైనల్‌ మ్యాచ్ ఉంటుందని తెలిపారు.

Story first published: Monday, January 20, 2025, 12:25 [IST]
Other articles published on Jan 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+