Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK Retention List: జడేజా‌‌పై కాసుల వర్షం- రిటైన్ లిస్ట్ ప్రకటించిన సీఎస్కే

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రిటెన్షన్ జాబితా ప్రకటనకు రంగం సిద్ధమైంది. తమ రిటైన్డ్ ప్లేయర్ జాబితా ప్రకటించడానికి ఫ్రాంచైజీలకి బీసీసీఐ ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. ఈ క్రమంలో ఒక్కో ఫ్రాంచైజీ తమ రిటైన్డ్ ప్లేయర్ల జాబితాను వెల్లడిస్తోంది. ఊహించనట్లుగానే చెన్నై సూపర్ కింగ్స్ పదునైన వ్యూహాలతో అయిదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకుంది.

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబె, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీష పతిరానాలను సీఎస్కే ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. ఎంఎస్ ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రిటైన్ అయ్యాడు. నిబంధనలకు అనుగుణంలో ధోనీని సీఎస్కే రూ.4 కోట్లకే రిటైన్ చేసుకుంది. అయితే రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజాకు రూ.18 కోట్లు వెచ్చించి చెన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. ఇక పతిరానాకు రూ. 13 కోట్లు, దూబెకు రూ.12 కోట్లతో సొంతం చేసుకుంది.

IPL 2025 Chennai Super Kings Retained and Released Players Full List with Major Retentions and Shock Exits

చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్ లిస్ట్:
రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివమ్ దూబె, మతీష పతిరానా, ఎంఎస్ ధోనీ

రిటెన్షన్ ఖర్చు అయిన డబ్బులు: రూ. 65 కోట్లు
పర్స్‌లో మిగిలి ఉన్న డబ్బులు: రూ. 55 కోట్లు

చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా:
రచిన్ రవీంద్ర, అజింక్య రహానె, డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, సమీర్ రిజ్వీ, దీపక్ చాహర్, మహేష్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మన్, తుషార్ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, నిశాంత్ సిద్ధు, మొయిన్ అలీ, మిచెల్ శాంట్నర్, జాదవ్ మండల్, ప్రశాంత్ సోలంకి, ముకేశ్ చౌదరి, సిమర్జీత్ సింగ్, హంగర్గేకర్, అరవెల్లి అవినాశ్.

Story first published: Thursday, October 31, 2024, 17:38 [IST]
Other articles published on Oct 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+