IPL 2025: సీఎస్కే ప్లే ఆఫ్స్ చేరాలంటే..!!
IPL 2025 CSK Play offs: ఐపీఎల్ 2025 చెన్నై సూపర్ కింగ్స్‌కు చెత్త సీజన్‌గా మారింది. ఆరు మ్యాచులు ఆడితే అందులో వరుసగా ఐదు మ్యాచులు ఓడింది. హోమ్ స్టేడియంలో హ్యాట్రిక్ ఓటమిని అందుకుంది. తాజాగా చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో దారుణంగా ఓడింది. 8 వికెట్ల తేడాతో పరాజయాన్ని చూసింది.
కేకేఆర్‌తో జరిగిన ఈ మ్యాచుకు ధోనీ నాయకత్వం వహించినా రాత మారలేదు. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 103/9 మాత్రమే చేసింది. లక్ష్యాన్ని కేకేఆర్.. కేవలం 10.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలవగా.. ఓటమితో సీఎస్కే 9వ స్థానానికి పడిపోయింది. దీంతో ఇప్పుడు సీఎస్కే అభిమానులకు భయం పట్టుకుంది. ఎందుకంటే ఈ వరుస ఓటములతో.. చెన్నై జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉండటం అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎస్కే ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అవ్వాలంటే సమీకరణలు ఎలా ఉండాలో తెలుసుకుందాం..
అప్పుడే ప్లే ఆఫ్స్ కు..
ఇప్పటివరకు ఎదురైన ఓటముల నేపథ్యంలో సీఎస్కే ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా మ్యాచులు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సీఎస్కే ముందు ఎనిమిది మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే, ఈ 8 మ్యాచులలో రెండు కన్నా ఎక్కువ మ్యాచ్‌లలో సీఎస్కే ఓడిపోతే.. ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసినట్టే. కాబట్టి ఈ 8 మ్యాచులలో కనీసం ఏడింటిలో విజయాలు సాధించడం తప్పనిసరి.
అప్పుడు ఈ ఎనిమిది మ్యాచుల్లో ఏడు గెలిస్తే సీఎస్కేకు 16 పాయింట్లు వస్తాయి. తద్వారా టాప్-4లో స్థానం దక్కించుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ఎనిమిది మ్యాచ్‌లు గెలిచినా.. టాప్-2లో కూడా బెర్త్ కన్ఫామ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
CSK నెక్ట్స్ ఆడబోయే మ్యాచ్ వివరాలివే..
CSK vs LSG: ఏప్రిల్ 14 ఎకానా క్రికెట్ స్టేడియం
CSK vs MI: ఏప్రిల్ 20 వాంఖెడె స్టేడియం
CSK vs SRH: ఏప్రిల్ 25 చెపాక్ స్టేడియం
CSK vs PBKS: ఏప్రిల్ 30 చెపాక్ స్టేడియం
CSK vs RCB: మే 3 చెపాక్ స్టేడియం
CSK vs KKR: మే 7 ఈడెన్ గార్డెన్స్
CSK vs RR: మే 12 చెపాక్ స్టేడియం
CSK vs GT: మే 18 నరేంద్ర మోదీ స్టేడియం

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications