IPL 2025 Captains: ఐపీఎల్ 2025కు రంగం సిద్ధమైంది. అయితే ఈ సీజన్ లో కొత్త సారథులు కూడా వచ్చారు. ఐదు జట్లకు కెప్టెన్లూ మారారు. లక్నోకు రిషభ్ పంత్, పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి అక్షర్ పటేల్, బెంగళూరుకు రజత్ పాటిదార్, కోల్‌కతాకు అజింక్య రహానే సారథులుగా ఎంపికయ్యారు. దీంతో ఈ కొత్త సారథులు.. ఈ కొత్త సీజన్ లో ఎలా రాణిస్తారన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగానూ మారింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025లో పాల్గొనే పది జట్ల సారథుల నెట్ వర్త్ ఎంత?, వారు ఎంత సంపాదిస్తున్నారు? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా 2024 సీజన్ లో బాధ్యతలు స్వీకరించాడు రుతురాజ్ గైక్వాడ్. అతడు సీఎస్కే నుంచి రూ.18 కోట్లు అందుకుంటున్నాడు. ఇదే సమయంలో అతడు దేశవాళీ క్రికెట్ తో పాటు ఎండోర్స్‌మెంట్స్, ఇతర వాటి నుంచి కూడా బానే సంపాదిస్తున్నాడు. మొత్తంగా అతడి నెట్ వర్త్ రూ.36 కోట్లు ఉంటుందని సమాచారం.

2.గుజరాత్ టైటాన్స్ శుభ్‌మన్ గిల్
2024లో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా ఎంపికైన శుభ్‌మన్ గిల్.. ప్రస్తుతం అన్నీ ఫార్మాట్లలో టీమింండియాలో స్టార్ క్రికెటర్ గా రాణిస్తున్నాడు. అతడు ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ ప్లేయర్. బీసీసీఐ నుంచి ఏటా రూ.5 కోట్లు ఆర్జిస్తున్నాడు. అతడిని గుజరాత్ రూ.16.5 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇంకా అతడు టాటా క్యాపిటల్, మై 11 సర్కిల్, జిలెట్ సహా ఇతర బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ల నుంచి సంపాదిస్తున్నాడు. అతడి నెట్ వర్త్ రూ.32 కోట్లు అని సమాచారం.
3.ముంబయి సారథి హార్దిక్ పాండ్య
ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య కూడా 2024లో కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అతడు గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ ప్లేయర్. రూ.5 కోట్లు అందుకుంటున్నాడు. ముంబయి అతడిని రూ.16.35కోట్లకు రిటైన్ చేసుకుంది. మొత్తంగా అతడి నెట్ వర్త్ రూ.91 కోట్లు.
4. పంజాబ్ కింగ్స్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ నుంచి ఎటువంటి సెంట్రల్ కాంట్రాక్ట్ పొందలేదు. అయినప్పటికీ అతడు పెద్ద బ్రాండ్ల ఎండోర్స్‌మెంట్ల నుంచి బానే ఆర్జిస్తున్నాడు. అతడి నెట్ వర్త్ రూ.58 కోట్లు.
5.రాజస్థాన్ రాయల్స్
2021 నుంచి రాజస్థాన్ రాయల్స్ కు సంజూ శాంసన్ స్టాండ్ ఔట్ స్కిప్పర్ గా వ్వహరిస్తున్నాడు. ఇతడు కూడా బీసీసీఐ నుంచి ఎటువంటి సెంట్రల్ కాంట్రాక్ట్ పొందలేదు. కానీ ఐపీఎల్ సహా ఇతర బ్రాండ్స్ నుంచి పెద్ద మొత్తాన్నే సంపాదిస్తున్నాడు. అతడి నెట్ వర్త్ రూ.82 కోట్లు.
6.సన్ రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ సారథిగా ఎంపికైన ప్యాట్ కమిన్స్ ను ఆ జట్టు రూ.20.50 కోట్లకు దక్కించుకుంది. ఈ ఏడాది అతడిని రూ.18 కోట్లకు హైదరాబాద్ జట్టు రిటైన్ చేసుకుంది. అతడు ఆస్ట్రేలియాకు కెప్టెన్ కూడా. అతడి నెట్ వర్త్ 43 మిలియన్ డాలర్లు ఉండొచ్చు.
ఇతర సారథుల నెట్ వర్త్ ఎంతంటే?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్ గా ఎంపికైన రజత్ పటిదార్ ప్రస్తుతం బీసీసీఐ నుంచి గ్రేడ్ సి కాంట్రాక్ట్ ను అందుకుంటున్నాడు. తద్వారా రూ.కోటి అందుకుంటున్నాడు. ఆర్సీబీ అతడి రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది. అతడి నెట్ వర్త్ రూ.2కోట్లు. కోల్‌కతా నైట్ రైడర్స్ కొత్త కెప్టెన్ అజింక్యా రహానే నెట్ వర్త్ రూ.80 కోట్ల వరకు ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్ సారథి రిషభ్ పంత్ నెట్ వర్త్ రూ.100 కోట్లు, దిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ అక్సర్ పటేల్ నెట్ వర్త్ రూ.49 కోట్లు అని సమాచారం. కాగా, పైన చెప్పిన వివరాలన్నీ ఇంగ్లీష్ మీడియా కథనాలు చూసి రాసినవి. ఇవి అధికార లెక్కలు కావు.