IPL 2025: క్రికెటర్ల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు తరచుగా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. చాలా మంది క్రికెటర్ల ప్రేమకథలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ రోజు మనం అలాంటి ఒక భారతీయ క్రికెటర్ ప్రేమకథ గురించి తెలుసుకోబోతున్నాం. అది సినిమా స్టోరీ కంటే తక్కువేం కాదు. ఆ ఆటగాడు ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. ఆ ప్రముఖ క్రికెటర్ మరెవరో కాదు స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్. ఇటీవల భువనేశ్వర్ కుమార్ ఓ పాడ్‌కాస్ట్ సందర్భంగా తన ఆసక్తికరమైన ప్రేమకథ గురించి వెల్లడించాడు. ఇది చాలా ఫన్నీగా ఉండడంతో పాటు ఆసక్తిగా కూడా ఉంది.
13 ఏళ్ల వయస్సులోనే ప్రేమలో పడిన భువీ..
ఆర్సీబీ స్టార్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉందని భువీ ఇటీవల రణ్‌వీర్ అల్లాబాదియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. నిజానికి భువనేశ్వర్ కుమార్ తన బాల్యంలో తన కుటుంబంతో కలిసి మీరట్ లో నివసించాడు. అప్పుడు నుపుర్ నాగర్ కూడా తన కుటుంబంతో నివసించడానికి డెహ్రాడూన్ నుంచి మీరట్ కు వచ్చింది. భువీ ఇంట్లోనే నుపుర్ నాగర్ కుటుంబం అద్దెకు నివసించారు. ఈ ఇద్దరూ మొదటి సారి ఒకరినొకరు చూసుకున్నప్పుడు భువీకి 13 సంవత్సరాలు, నుపుర్ కు 11 ఏళ్ల వయస్సు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అతి కాస్త తర్వాత ప్రేమగా మారింది. అనంతరం బలమైన బంధానికి దారి తీసింది. అంటే ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

2017లో వివాహం
భువనేశ్వర్, నుపుర్ చాలా సంవత్సరాలు డేటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత వారు 2017 సంవత్సరంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ నవంబర్ 23, 2017న వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉంది.
ఆర్సీబీ తరపున ఆడుతున్న భువీ..
ఐపీఎల్ 2025 మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్ ను ఆర్సీబీ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీనికి ముందు భువీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 11 సంవత్సరాలు ఆడాడు. ఇప్పుటివరకు ఆర్సీబీ తరపున భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణించాడు. 5 మ్యాచ్ ల్లో బౌలింగ్ చేస్తూ 5 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో భువనేశ్వర్ తొలి మ్యాచ్ ఆడలేకపోయాడు.