Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: హార్దిక్ పాండ్యా, ఆశిష్ నెహ్రాకు బీసీసీఐ బిగ్ షాక్!

IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా కీలక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ జట్టును 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 155 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ జరిమానా విధించింది.

హార్దిక్ పాండ్యాకు జరిమానా
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి స్లో ఓవర్ రేట్ కు పాల్పడినట్లు తేలింది. దీని కారణంగా హార్దిక్ పాండ్యాకు రూ.24 లక్షల జరిమానా విధించబడింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు రెండోసారి స్లో ఓవర్ రేట్ నేరానికి పాల్పడింది. హార్దిక్ పాండ్యాకు జరిమానా విధించడం ఇది రెండోసారి. ఇది కాకుండా జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించబడింది.

IPL 2025 BCCI Fines Hardik Pandya Rs 24 Lakh for Slow Over Rate Ashish Nehra Penalized Too

ఆశిష్ నెహ్రాకు కూడా..
మరోవైపు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రాకు కూడా అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించబడింది. దీనితో పాటు ఈ నేరానికి నెహ్రాకు ఒక డీమెరిట్ పాయింట్ కూడా లభించింది. "ఆశిష్ నెహ్రా ఆర్టికల్ 2.20 కింద లెవల్ 1 నేరాన్ని అంగీకరించాడు. ఇది ఆట స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడానికి సంబంధించినది. మ్యాచ్ రిఫరీ అనుమతిని అంగీకరించాడు." అని ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఓటమి పాలైన ముంబై
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 155 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టుకు డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం 147 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశిచారు. గుజరాత్ 19 ఓవర్లలోనే సాధించింది. ఈ విజయంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

Story first published: Wednesday, May 7, 2025, 13:24 [IST]
Other articles published on May 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+