Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఐపీఎల్ 'బ్యాట్ డాక్టర్'.. స్టార్ క్రికెటర్ల బ్యాట్లను రీపేర్ చేసేది ఇతడే!!

IPL 2025 Bat Checking: ఐపీఎల్‌ 2025లో గత నాలుగైదు మ్యాచ్‌ల నుంచి క్రికెటర్ల బ్యాట్లను అంపైర్లు తనిఖీలు చేస్తోన్న సంగతి తెలిసిందే. బ్యాటర్లు క్రీజులోకి వస్తోన్న సమయంలో అంపైర్లు వాటిని తనిఖీ చేస్తున్న దృశ్యాల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బ్యాట్ సైజు నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా.. మ్యాచు సమయంలో కేకేఆర్‌ బ్యాటర్లు సునీల్‌ నరైన్‌, ఆన్రిచ్‌ నోకియా, రమన్ దీప్ సింగ్ బ్యాట్లను మార్చాలని ఆదేశించారు. దీంతో వారు వేరే బ్యాట్లతో ఆడాల్సి వచ్చింది.

అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో బ్యాట్ల సైజు విషయమై తనిఖీ జరుగుతోన్న సమయంలో ఓ 'బ్యాట్ డాక్టర్' గురించి తెలిసింది. బ్యాట్ డాక్టర్ ఏంటని అనుకుంటున్నారా?. అతడే ప్రస్తుతం పలువురు ఐపీఎల్ స్టార్ క్రికెటర్ల బ్యాట్లను రీపేర్ చేస్తున్నాడని తెలిసింది. ముఖ్యంగా కేకేఆర్ బ్యాటర్ల బ్యాట్లను సర్వీస్ చేస్తున్నాడని సమాచారం అందింది. అతడి పేరు అజిత్ కుమార్ శర్మ. వెస్ట్ బెంగాల్ లోని హతియారాకు చెందిన ఇతడి వృత్తి.. బ్యాట్ల సర్వీస్ చేయడం.

IPL 2025 Bat Doctor Ajit kumar sharma who repairs IPL Star Cricketers bats

వాళ్ల బ్యాట్లకు నేనే రీపేర్ చేశా..
"నేను ఎక్కువగా బ్యాట్ల సర్వీస్ చేస్తుంటాను. బ్యాటులో ఏమైనా సమస్య వస్తే.. క్రికెటర్లు తమ బ్యాట్లను నా వద్దకు పంపిస్తారు. లేదా నన్ను పిలిపిస్తారు. రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రానా, మనీశ్ పాండే, రమన్ దీప్ సింగ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, అండ్రూ రసెల్, జో రూట్, బెన్ స్టోక్స్ వాళ్ల బ్యాట్లను రీపేర్ కోసం నా దగ్గరికే తీసుకొచ్చారు." అని అజిత్ చెప్పుకొచ్చాడు.

రూ.800 నుంచి రూ.1000 వరకు..
"సునీల్ నరైన్ బ్యాట్ వెడల్పులో ఎటువంటి సమస్య లేదు. కాకపోతే అతడి బ్యాట్ హ్యాండిల్ లో కొంత సమస్య కనిపించింది. వాళ్లు నా దగ్గరికి రారు. నేనే వాళ్ల హోటల్ కు వెళ్తాను. అక్కడే ఆ బ్యాట్లకు ఏం రీపేర్ ఉంటే అది చేసి ఇచ్చేస్తాను. ఓపెనింగ్ మ్యాచులో ఫిల్ సాల్ట్ బ్యాట్ విరిగింది. దాన్ని నా దగ్గరే బాగు చేయించాడు. గతేడాది నుంచి అతడు నా దగ్గరే బ్యాట్ సర్వీస్ చేయిస్తున్నాడు. అంతర్జాతీయ మ్యాచుల సమయంలోనూ ఇక్కడికి వచ్చినప్పుడు నేనే అతడి బ్యాట్ బాగు చేసి ఇస్తాను. ఒక్క బ్యాట్ రీపేర్ చేసినందుకు రూ.800 నుంచి రూ.1000 రూపాయలు తీసుకుంటాను. అయితే ఐపీఎల్ బ్యాటర్ల బ్యాట్లకు, ఇతర బ్యాట్లకు సర్వీస్ ఛార్జ్ ఒకేలా ఉండదు" అని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ కథనం ఓ వెస్ట్ బెంగాల్ న్యూస్ వెబ్ సైట్ చూసి రాసినది. అందులో ఉన్న సమాచారాన్నే ఇక్కడ అందించాం.

బ్యాట్ సైజు ఎంత ఉండాలంటే?
బీసీసీఐ నిబంధనల ప్రకారం బ్యాట్‌ వెడల్పు 10.79 సెంటీమీటర్లను మించకూడదట. బ్యాట్‌ మందం 6.7 సెం.మీ, పొడవు 96.4 సెం. మీ, బ్యాట్‌ అంచు వెడల్పు 4 సెం.మీగా ఉండాలి. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే బ్యాట్లను కచ్చితంగా మార్చాల్సిందే.

Story first published: Friday, April 18, 2025, 20:06 [IST]
Other articles published on Apr 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+